భారత్ Vs వెస్టిండిస్: వన్డే సిరిస్ షెడ్యూల్, మ్యాచ్ టైమింగ్, వేదికలు వివరాలు


హైదరాబాద్: విండిస్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇప్పుడు వన్డే సిరిస్‌పై కన్నేసింది. టెస్టు సిరిస్ ముగియడంతో ఇరు జట్ల మధ్య ఐదు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది. వన్డే సిరిస్‌లోనూ టీమిండియానే హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది.
కాగా, ఐదు రోజుల జరగాల్సిన హైదరాబాద్ టెస్టు మూడు రోజులకే ముగియడంతో వన్డే సిరిస్‌కు ముందు కోహ్లీసేనకు ఆరు రోజుల విరామం లభించింది. అక్టోబర్ 21న గువహటి వేదికగా జరిగే తొలి వన్డేతో ప్రారంభమయ్యే ఐదు వన్డేల సిరిస్ నవంబర్ 1వ తేదీన తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ మైదానంలో జరిగే ఆఖరి వన్డేతో ముగుస్తుంది.

5 మ్యాచ్‌ల వన్డే సిరీస్ షెడ్యూల్:
తొలి వన్డే: అక్టోబర్ 21న గువహతి బసపర క్రికెట్ స్టేడియం
రెండో వన్డే: అక్టోబర్ 24న విశాఖపట్నం ఏసీఏ,వీడిసిఏ క్రికెట్ స్టేడియం
మూడో వన్డే: అక్టోబర్ 27న పూణే మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం
నాలుగో వన్డే: అక్టోబర్ 29న ముంబై బ్రబౌర్న్ స్టేడియం
ఐదో వన్డే: నవంబర్ 1న తిరువనంతపురం గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం

వన్డే ర్యాంకింగ్స్‌లో రెండోస్థానంలో టీమిండియా
ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా రెండోస్థానంలో కొనసాగుతుండగా.. పర్యాటక వెస్టిండిస్ జట్టు తొమ్మిదోస్థానంలో ఉంది. వెస్టిండీస్‌తో ఐదు వన్డేల సిరిస్ కోసం తొలి రెండు వన్డేలకు సెలక్టర్లు ప్రకటించిన భారత జట్టు యువ ఆటగాళ్లతో పటిష్టంగా ఉంది. విండిస్‌తో టెస్టు సిరిస్‌కు జట్టులో చోటు కోల్పోయిన ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు తిరిగి వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు.

విండిస్‌తో వన్డే సిరిస్‌కు కెప్టెన్ కోహ్లీ
ఆసియా కప్‌కు దూరంగా ఉన్న కోహ్లీ విండిస్‌తో వన్డే సిరీస్‌కు తిరిగి కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. స్టాండ్ బై కెప్టెన్‌గా భారత్‌కు ఆసియా కప్ అందించిన రోహిత్ శర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. నిలకడగా రాణించడంలో విఫలమైన దినేశ్‌కార్తీక్ స్థానంలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు అవకాశమిచ్చారు. తొలి రెండు వన్డేలకు గాను టీమిండియా ప్రధాన పేసర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతినిచ్చారు.

భువనేశ్వర్ కుమార్ స్థానంలో మహమ్మద్ షమీ
యువ పేసర్ ఖలీల్ అహ్మద్ చోటు నిలుపుకోగా... భువనేశ్వర్ కుమార్ స్థానంలో మహమ్మద్ షమీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. మనీష్ పాండే, అంబటి రాయుడు, కేఎల్ రాహుల్ సైతం జట్టులో చోటు దక్కించుకున్నారు. యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లతో పాటు మూడో స్పిన్నర్‌గా రవీంద్ర జడేజా ఎంపికయ్యాడు.

తొలి రెండు వన్డేలకు టీమిండియా:
విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కె ఎల్ రాహుల్, అంబటి రాయుడు, మనీష్ పాండే, ధోనీ (వికెట్ కీపర్ ), రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, చహల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, ఖలీల్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications