For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దానికోసమే కాస్త ఆలస్యంగా మొదలుపెట్టాం: రోహిత్ శర్మ

India vs West Indies 2018: Rohit Sharmas record-breaking knock seals series win

హైదరాబాద్: వెస్టిండీస్‌పై తలపడి రెండు ఫార్మాట్లలో విజయం సాధించిన టీమిండియాకి మరో సిరీస్‌లోనూ విజయం ఖరారైపోయింది. లక్నో వేదికగా జరిగిన రెండో టీ20లో కెప్టెన్ రోహిత్ రెచ్చిపోవడంతో భారత్ 71పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపెనర్ రోహిత్‌ శర్మ(111నాటౌట్‌; 61బంతుల్లో 8ఫోర్లు, 7సిక్సులు) భారీ సిక్సర్లు, బౌండరీలతో సెంచరీ బాదాడు.

మరో మ్యాచ్‌ ఉండగానే 2-0తో సిరీస్ కైవసం

మరో మ్యాచ్‌ ఉండగానే 2-0తో సిరీస్ కైవసం

అనంతరం చేధనకు దిగిన విండీస్ బ్యాట్స్‌మెన్‌ను బౌలర్లు కట్టడి చేస్తూ సత్తా చాటారు. ఇలా నిర్ణీత 20ఓవర్లలో విండీస్‌ తొమ్మిది వికెట్లు కోల్పోయి 124పరుగులకే పరిమితమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌‌ను మరో మ్యాచ్‌ ఉండగానే 2-0తో భారత్ కైవసం చేసుకుంది. టీమిండియా జట్టు సమష్టి కృషి విండీస్‌పై విజయానికి కారణమైందని రోహిత్‌ పేర్కొన్నాడు.

పిచ్‌ గురించి తెలుసుకోవడానికి సమయం పట్టింది

పిచ్‌ గురించి తెలుసుకోవడానికి సమయం పట్టింది

దీనిపై రోహిత్‌ మాట్లాడుతూ.. 'స్టేడియం కొత్తది కావడం వల్ల పిచ్‌ ఏ విధంగా సహకరిస్తుందో ఎవ్వరికీ సరైన అవగాహన లేదు. టాస్‌ ఓడిపోవడంతో ముందుగా బ్యాటింగ్‌ దిగినా.. ఆరంభంలో విండీస్‌ బౌలర్లను జాగ్రత్తగా ఎదుర్కోంటూ వచ్చాం. ఈ క్రమంలో పిచ్‌ ఎలా సహకరిస్తుందో తెలుసుకోవడానికి కాస్త సమయం పట్టింది. ఎప్పుడైతే పిచ్‌పై ఓ అవగాహన వచ్చిందో.. అప్పటి నుంచి మా శైలిలో దూకుడుగా ఆడటం మొదలుపెట్టా.'

120 భాగస్వామ్యం కీలకమైందిగా భావిస్తున్నా.

120 భాగస్వామ్యం కీలకమైందిగా భావిస్తున్నా.

'మరోవైపు ధావన్ కూడా బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాలని వేచి చూశాడు. అందుకే గత మ్యాచ్‌లలో మాదిరిగా నిదానంగా ఇన్నింగ్స్‌ ఆరంభించాడు. మా మధ్య 120పరుగుల భాగస్వామ్యం కూడా చాలా కీలకమైనదిగా భావిస్తున్నా. ఈ ఆరంభానికి చివర్లో కేఎల్‌ రాహుల్ ఘనమైన ముగింపునిచ్చాడని అనుకుంటున్నాను.

బౌలింగ్‌ దళంలో బుమ్రా ఎంతో ప్రత్యేకం

బౌలింగ్‌ దళంలో బుమ్రా ఎంతో ప్రత్యేకం

మరోవైపు ఫాస్ట్‌ బౌలర్లు బుమ్రా, ఖలీల్‌ ప్రదర్శన తననెంతగానో ఆకట్టుకుందని హిట్‌మ్యాన్‌ తెలిపాడు. వన్డేలతో పోల్చితే.. టీ20ల్లో బుమ్రా కాస్త భిన్నంగా బంతులు వేశాడు. మా బౌలింగ్‌ దళంలో అతనెంతో ప్రత్యేకం. అదేవిధంగా కొత్తబంతితో ఖలీల్‌ అహ్మద్‌ అద్భుతంగా రాణించాడు. చక్కగా స్వింగ్‌ రాబడుతూ.. ఛాలెంజింగ్‌గా బౌలింగ్‌ చేశాడు. ఆరంభంలోనే అతను వికెట్లు పడగొట్టి.. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టడం కూడా జట్టుకు ఎంతో తోడ్పాటునిచ్చిందని రోహిత్‌ వివరించాడు.

Story first published: Wednesday, November 7, 2018, 12:14 [IST]
Other articles published on Nov 7, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+