రాజ్‌కోట్ టెస్టు, డే3: వెస్టిండిస్ 181 ఆలౌట్, భారత ఆధిక్యం 468


హైదరాబాద్: రాజ్‌కోట్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించడం ఖాయమైంది. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ బ్యాట్స్‌మన్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. మూడో రోజైన శనివారం ఓవర్ నైట్ స్కోరు 94/6తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన వెస్టిండీస్ జట్టు 181పరుగులకే ఆలౌటైంది.
భారత్‌కు 468 పరుగుల భారీ ఆధిక్యం
శుక్రవారం భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌ని 649/9తో డిక్లేర్ చేసిన నేపథ్యంలో.. 468 పరుగుల భారీ ఆధిక్యం భారత్‌కు లభించింది. దీంతో వెస్టిండీస్ జట్టు ఫాలో ఆన్ ఆడటం అనివార్యమైంది. ఓవర్‌నైట్ స్కోరు 94/6తో మూడో రోజు ఆటను ప్రారంభించిన విండీస్ ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయింది.
మూడో రోజు 87 పరుగులు మాత్రమే జోడించి
మూడో రోజు 87 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన వికెట్లను కోల్పోయింది. మూడో రోజు అశ్విన్ మూడు వికెట్లు తీసి విండీస్ పతనాన్ని శాసించాడు. ఉమేశ్ యాదవ్ ఒక వికెట్ దక్కింది. మొత్తం భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. షమీ రెండు, ఉమేశ్ యాదవ్, జడేజా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు.

వెస్టిండిస్ జట్టులో టాప్ స్కోరర్‌గా రోస్టన్ చేజ్
వెస్టిండీస్ జట్టులో రోస్టన్ చేజ్ (53: 79 బంతుల్లో 8 ఫోర్లు), కీమో పాల్ (47: 49 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులు) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 649/9కి డిక్లెర్ చేసిన విషయం తెలిసిందే. గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టులో తొలి టెస్టు తొలిరోజు యువ ఆటగాడు పృథ్వీషా (134) పరుగులతో సెంచరీ సాధించాడు.

649/9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్
అదే రోజు పుజారా (86) పరుగులతో తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఇక, రెండో రోజైన శుక్రవారం విరాట్ కోహ్లీ(137) సెంచరీ చేశాడు. కోహ్లీ సెంచరీ చేయగా, రిషబ్ పంత్(92) చేజార్చుకున్నాడు. అనంతరం జడేజా 132 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. జడేజా సెంచరీ అనంతరం కెప్టెన్ కోహ్లీ భారత ఇన్నింగ్స్‌ను 649/9 వద్ద డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications