గంగూలీ-ధోని రికార్డు బద్దలు: కెప్టెన్‌గా కోహ్లీ ఖాతాలో మరో రికార్డు


హైదరాబాద్: రాజ్‌కోట్ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రత‍్యర్థి జట‍్లను ఫాలోఆన్ ఆడించడం ద్వారా విరాట్ కోహ్లీ ఖాతాలో ఈ రికార్డు వచ్చి చేరింది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న తొలి టెస్టులో విండీస్ ఫాలోఆన్ ఆడుతున్న సంగతి తెలిసిందే.
దీని ఫలితంగా అత్యధిక సార్లు ఫాలోఆన్ ఆడించిన భారత కెప్టెన్ల జాబితాలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకూ ప్రత్యర్థి జట్టును కోహ్లీ ఐదు సార్లు ఫాలోఆన్‌కు ఆహ్వానించగా, మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ ఏడుసార్లు ఫాలో ఆన్ ఆడించాడు. దాంతో ఎక్కువ సార్లు ఫాలోఆన్ ఆడించిన భారత కెప్టెన్ల జాబితాలో కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు.

గంగూలీ-ధోనిల రికార్డుని బద్దలు కొట్టిన కోహ్లీ
ఈ క్రమంలో మాజీ క్రికెట్ దిగ్గజాలైన సౌరవ్ గంగూలీ, ధోనిల రికార్డుని కోహ్లీ అధిగమించాడు. గంగూలీ-ధోనిలు కెప్టెన్లగా ఉన్న సమయంలో ప‍్రత్యర్థి జట్టును నాలుగుసార్లు ఫాలోఆన్ ఆడించారు. ఇప్పటివరకూ వీరితో కలిసి కోహ్లి సంయుక్తంగా రెండో స్థానంలో ఉండగా తాజాగా ఇప్పుడు ఆ రికార్డుని కోహ్లీ అధిగమించాడు.

నాలుగో స్థానంలో గావస్కర్-రాహుల్ ద‍్రవిడ్
ఇక సునీల్ గావస్కర్-రాహుల్ ద‍్రవిడ్‌లు ప్రత్యర్ధి జట్లు మూడేసిసార్లు ఫాలోఆన్ ఆడించడం ద్వారా నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే ఆలౌటైన వెస్టిండిస్ ఫాలోఆన్ ఆడుతోన్న సంగతి తెలిసిందే.

181పరుగులకే ఆలౌటైన వెస్టిండిస్ జట్టు
మూడో రోజైన శనివారం ఓవర్ నైట్ స్కోరు 94/6తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన వెస్టిండీస్ జట్టు 181పరుగులకే ఆలౌటైంది. మూడో రోజు ఆటను ప్రారంభించిన విండీస్ ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయింది. మూడో రోజు 87 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన వికెట్లను కోల్పోయింది. శుక్రవారం భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌ని 649/9తో డిక్లేర్ చేసిన నేపథ్యంలో.. 468 పరుగుల భారీ ఆధిక్యం భారత్‌కు లభించింది.

తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన అశ్విన్
మూడో రోజు అశ్విన్ మూడు వికెట్లు తీసి విండీస్ పతనాన్ని శాసించాడు. ఉమేశ్ యాదవ్ ఒక వికెట్ దక్కింది. మొత్తం భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. షమీ రెండు, ఉమేశ్ యాదవ్, జడేజా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు. వెస్టిండీస్ జట్టులో రోస్టన్ చేజ్ (53: 79 బంతుల్లో 8 ఫోర్లు), కీమో పాల్ (47: 49 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులు) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications