
రాహుల్‌కు ఇదే మంచి అవకాశం:
రెగ్యులర్ ఓపెనర్ శిఖర్ ధవన్ గాయం కారణంగా.. రోహిత్ శర్మతో కలిసి లోకేశ్ రాహుల్ ఓపెనింగ్ చేయడం దాదాపుగా ఖాయమే. రాహుల్ ఇక్కడ మెరుపులు మెరిపిస్తే.. రోహిత్‌కు రెగ్యులర్ భాగస్వామి కూడా కావొచ్చు. బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ జట్టును నడిపించనున్నాడు. కోహ్లీ ఫామ్‌కు ఏ ఢోకా లేదు. మిడిలార్డర్‌లో శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండేలు సత్తా చాటేందుఇకు సిద్ధంగా ఉన్నారు.

పంత్‌పైనే దృష్టి:
ఎంఎస్ ధోనీ వారసుడిగా వచ్చిన రిషబ్ పంత్ నిలకడలేని ఆటతీరుతో నిరాశపరుస్తున్నాడు. గతకొంత కాలంగా బ్యాట్, గ్లౌజ్‌లతో ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్న పంత్ విండీస్‌పై రాణించాల్సిన అవసరముంది. క్రీజులోకి రాగానే భారీ షాట్లు ఆడాలని ప్రయత్నిస్తున్న పంత్.. ముందు వికెట్ విలువ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. శివమ్ దూబే భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు.

షమీకి నో చాన్స్:
స్పిన్ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజాకు చోటు ఖాయమే. అయితే చాహల్‌కు తోడుగా కుల్దీప్‌ను కూడా ఆడించాలనుకుంటే అతనిపై వేటు తప్పకపోవచ్చు. భువనేశ్వర్‌తో పాటు షమీ, దీపక్‌లో ఒక్కరే తుది జట్టులో ఉంటారు. తాజా ఫామ్ ప్రకారం చూసుకుంటే దీపక్‌ను ఆడించే చాన్స్ ఎక్కువగా ఉంది. షమీకి తుది జట్టులో చాన్స్ లేకపోవచ్చు. ఇటీవల దీపక్ చెలరేగుతుండటంతో కోహ్లీ ఈ కుర్రాడివైపే మొగ్గుచూపొచ్చు.

వెస్టిండీస్‌కు అదే పెద్ద సమస్య
అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేకపోవడం వెస్టిండీస్‌కు పెద్ద సమస్య. రసెల్, బ్రాత్‌వైట్, బ్రేవోలను కాదని వెస్టిండీస్ పూర్తిగా యువ ఆటగాళ్లతో భారత్‌కు వచ్చింది. నికోలస్ పూరన్ కూడా లేడు. దీంతో బ్యాటింగ్ భారం ఓపెనర్లు ఎవిన్ లూయిస్, లెండిల్ సిమన్స్.. హెట్‌మైర్, పొలార్డ్‌లపైనే పడింది. ఇక బౌలర్లలలో హోల్డర్, కీమో పాల్, కాట్రెల్‌లు చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నారు.

పిచ్ వాతావరణం:
రెండు రోజుల క్రితం చినుకులు పడటం కాస్త కలవరపెట్టినా.. శుక్రవారం వాతావరణం మ్యాచ్‌కు అనుకూలంగా ఉండనుంది. వర్షం ముప్పులేదు. గత ఐపీఎల్ మ్యాచ్‌లను పరిశీలిస్తే.. ఈ పిచ్ బౌలర్లకు బాగా కలిసొచ్చింది. 2018 జనవరి నుంచి ఈ వికెట్‌పై తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 162 పరుగులు.

తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషభ్ పంత్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, చాహల్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్.
వెస్టిండీస్: పొలార్డ్ (కెప్టెన్), లూయిస్, సిమన్స్, బ్రండన్కింగ్, హెట్‌మైర్, రామ్‌దిన్, హోల్డర్, ఖారీ పైర్/కీమో పాల్, అలెన్, హైడెన్ వాల్ష్, కాట్రెల్.


Click it and Unblock the Notifications












