Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీ20ల్లోనూ బోణీ కొట్టేసిన భారత్..

India Vs West Indies T20I,2018: India Beat West Indies, Take 1-0 Lead
India captain Rohit Sharma won the toss

కోల్‌కతా: వెస్టిండీస్‌పై టెస్టు, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న టీమిండియా టీ20 సిరీస్‌ను విజయంతో బోణీ కొట్టింది. తొలుత బౌలింగ్‌లో టీ20 ప్రపంచ చాంపియన్లను స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన రోహిత్ శర్మ సేన.. బ్యాటింగ్‌లో తడబడినా చివరికి విజయాన్ని అందుకుంది. మూడు ఓవర్లకే ఓపెనర్లు ఔట్‌.. మరో మూడు ఓవర్లకే మరో రెండు వికెట్లు..అప్పటికి స్కోరు 45/4.. వెస్టిండీస్‌ నిర్దేశించిన 110పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌ పరిస్థితి ఇది.

అయినప్పటికీ విండీస్‌ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్న దినేశ్‌ కార్తీక్‌(31నాటౌట్‌; 34బంతుల్లో 3ఫోర్లు, 1సిక్సు), మనీశ్‌ పాండే(19; 24బంతుల్లో 2ఫోర్లు)తో కలిసి భారత విజయానికి బాటలు వేశాడు. దీంతో విండీస్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్‌ ఐదు వికెట్లు కోల్పోయి 17.5ఓవర్లలో ఛేదించింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు చేజార్చుకుంది.

110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే కెప్టెన్ రోహిత్‌ వికెట్ కోల్పోయింది. ఫోర్ కొట్టి కాన్ఫిడెంట్‌గా కనిపించిన రోహిత్ ఓవర్ చివరి బంతికి క్యాచ్ ఔట్ అయ్యాడు. విండీస్ కీపర్ రామ్‌దిన్ అందుకున్న క్యాచ్‌కు తొలి వికెట్‌గా రోహిత్ వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో థామస్ మరోసారి భారత్‌ను దెబ్బకొట్టాడు. గంటకు 147 కి.మీ వేగంతో థామస్ వేసిన బంతిని ధావన్ డిఫెన్స్ ఆడాలని చూడగా.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత్ 16 పరుగులకు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది.

విండీస్ కెప్టెన్ కార్లోస్ బ్రాత్ వైట్ బౌలింగ్‌లో రాణించాడు. లోకేష్ రాహుల్ (22 బంతుల్లో 16)తో పాటు హార్డ్ హిట్టర్ రిషబ్ పంత్ (1) వికెట్లు పడగొట్టి విండీస్ శిబిరంలో ఆశలు రేపాడు. రాహుల్, పంత్ క్యాచ్ ఔట్‌ కాగా, విండీస్ ఫీల్డర్ డారెన్ బ్రేవో వీరి క్యాచ్‌లు అందుకున్నాడు. దీంతో భారత్ 50 పరుగులకే 4 ప్రధాన వికెట్లు కోల్పోయింది. అయితే కార్తీక్, కృనాల్ పాండ్యా రాణించడంతో మరో 2 ఓవర్లు మిగిలుండానే భారత్ అలవోకగా విజయం సాధించింది.

Story first published: Sunday, November 4, 2018, 22:47 [IST]
Other articles published on Nov 4, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+