For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'జట్టు తరఫున ఆడాలని భావించా.. జట్టుకు సారథ్యం వహించాలని ఎప్పుడూ అనుకోలేదు'!!

India vs West Indies 1st T20: Kieron Pollard has revealed that captaincy was rather sprung upon him

హైదరాబాద్: వెస్టిండీస్‌ తరఫున ఆడాలని భావించాను. కానీ.. జట్టుకు సారథ్యం వహించాలని ఎప్పుడూ అనుకోలేదు అని వెస్టిండీస్‌ కెప్టెన్ కీరన్‌ పొలార్డ్‌ అన్నాడు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడు టీ20లు, మూడు వన్డేలు జరగనున్నాయి. డిసెంబర్‌ 6న ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే తొలి టీ20 మ్యాచ్‌తో ఈ పర్యటన ప్రారంభం కానుంది. తొలి టీ20 మ్యాచ్ కోసం మంగళవారం భారత్-వెస్టిండీస్ జట్లు నగరానికి చేరకున్నాయి.

అదే నా కర్తవ్యం:

అదే నా కర్తవ్యం:

తొలి టీ20 సందర్భంగా పొలార్డ్‌ మాట్లాడుతూ... 'చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్నాను. విండీస్ బోర్డుతో ఉన్న ఇబ్బందులు, ఇతర కారణాలతో మూడు-నాలుగు ఏళ్లు జట్టుకు దూరంగా ఉన్నా. ఇందులో రహస్యం ఏమీ లేదు. నా పని ఎంతో సులువైనది. డ్రెస్సింగ్‌ రూమ్‌లో నా అనుభవాన్ని యువ ఆటగాళ్లతో పంచుకుంటా వారికి మార్గనిర్దేశం అవసరం. వారిని సరైన మార్గంలో నడపించడమే నా కర్తవ్యం' అని తెలిపాడు.

సారథ్యం వహించాలని ఎప్పుడూ అనుకోలేదు:

సారథ్యం వహించాలని ఎప్పుడూ అనుకోలేదు:

'వెస్టిండీస్‌ జట్టు తరఫున ఆడాలని భావించాను. కానీ.. జట్టుకు సారథ్యం వహించాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. క్రికెట్ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిని చూసి వెనకడుగు వేయను. దైర్యంగా ఎదుర్కోవడమే తెలుసు' అని పొలార్డ్‌ పేర్కొన్నాడు. 'టీమిండియా బలమైన జట్టు. ఇప్పుడు మేం బలమైన ప్రత్యర్థితో తలపడనున్నాం. అండర్ డాగ్స్ ముద్ర మంచిదే. మా సత్తా మేరకు ప్రయత్నిస్తే ఎలాంటి ఫలితాలైనా రావొచ్చు' అని పొలార్డ్ అన్నాడు.

అఫ్గానిస్థాన్‌పై సిరీస్ ఓటమి:

అఫ్గానిస్థాన్‌పై సిరీస్ ఓటమి:

మంగళవారం దాదాపు మూడు గంటల పాటు కరీబియన్ ఆటగాళ్లు ఉప్పల్‌ స్టేడియంలో చెమటోడ్చారు. బుధవారం, గురువారం కూడా ఇరు జట్లు ఉప్పల్‌ స్టేడియంలో ప్రాక్టీస్ చేయనున్నాయని హెచ్‌సీఏ అధికారులు తెలిపారు. ఇటీవల అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను వెస్టిండీస్‌ 1-2 తేడాతో కోల్పోయింది. మరి టీమిండియాకు ఏ మేరకు పోటీ ఇస్తుందో చూడాలి.

భద్రతా కారణాల దృష్టా:

భద్రతా కారణాల దృష్టా:

షెడ్యూల్ ప్రకారం సిరీస్ ముంబై మ్యాచ్‌తో ప్రారంభం కావాల్సి ఉన్నా.. భద్రతా కారణాల దృష్టా వేదికలలో మార్పులు చేసింది బీసీసీఐ. తొలి మ్యాచ్ కోసం హైదరాబాద్ ఆతిధ్యం ఇస్తుండగా.. డిసెంబర్ 11న చివరి మ్యాచ్‌ వాంఖెడేలో జరగనుంది. డిసెంబర్ 8న తిరువనంతపురంలో రెండో టీ20 జరుగుతుంది. ఈ సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య చెన్నై (డిసెంబర్ 15), విశాఖపట్నం (డిసెంబర్ 18), కటక్ (డిసెంబర్ 22) లలో మూడు వన్డేలు జరుగనున్నాయి.

T20 squad:

T20 squad:

Fabian Allen, Brandon King, Denesh Ramdin, Sheldon Cottrell, Evin Lewis, Sherfane Rutherford, Shimron Hetmyer, Khary Pierre, Lendl Simmons, Jason Holder, Kieron Pollard (C), Hayden Walsh Jr, Keemo Paul, Nicholas Pooran, Kesrick Williams.

Story first published: Wednesday, December 4, 2019, 10:58 [IST]
Other articles published on Dec 4, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+