న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆదుకున్న అయ్యర్‌, పంత్‌.. మెరిసిన జాదవ్.. విండీస్ లక్ష్యం 288

India vs West Indies 1st: Shreyas Iyer, Rishabh Pant, Kedar Jadhav shines as IND post 288

చెన్నై: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చెన్నై చిదంబరం స్టేడియంలో విండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసి.. విండీస్ ముందు 288 పరుగుల లక్ష్యంను ఉంచింది. టీమిండియా యువ బ్యాట్స్‌మెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ (70), రిషబ్‌ పంత్‌ (71)లు హఫ్‌ సెంచరీలతో రాణించారు. విండీస్ బౌలర్లలో కాట్రెల్, జోసఫ్, కీమో పాల్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.

<strong>ప్రపంచంలోనే చెత్త కీపర్‌.. కెప్టెన్‌ కాబట్టే జట్టులో ఉన్నాడు!!</strong>ప్రపంచంలోనే చెత్త కీపర్‌.. కెప్టెన్‌ కాబట్టే జట్టులో ఉన్నాడు!!

ఆదిలోనే షాక్:

ఆదిలోనే షాక్:

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు విండీస్ బౌలర్ షెల్డాన్‌ కాట్రెల్‌ షాక్ ఇచ్చాడు. ఏడో ఓవర్ మూడో బంతికి ఓపెనర్ కేఎల్ రాహుల్ (6)ను పెవిలియన్ చేర్చాడు. బంతిని అంచనా వేయడంలో విఫలమయిన రాహుల్.. షిమ్రాన్‌ హెట్‌మెయిర్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (4) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. అదే ఓవర్ చివరి బంతి కోహ్లీ బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్లను గిరాటేసింది. దీంతో కీలక రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాలో పడింది.

 పంత్‌ ధనాధన్‌:

పంత్‌ ధనాధన్‌:

అయితే మరో ఓపెనర్ రోహిత్ శర్మ యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. అయితే ఆరు ఫోర్లు కొట్టి మంచి జోరుమీదున్న రోహిత్‌.. పోలార్డ్ చేతికి చిక్కాడు. జోసెఫ్ బౌలింగ్‌లో రోహిత్ (36) పెవిలియన్ బాట పట్టాడు. రోహిత్‌ ఔటైన తర్వాత ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపించే బాధ్యతను అయ్యర్‌ తీసుకున్నాడు. ఆరంభంలో నిదానంగా ఆడిన అతడు కుదురుకున్నాక జోరు పెంచాడు.

 హఫ్‌ సెంచరీలు:

హఫ్‌ సెంచరీలు:

క్రీజులోకి వచ్చిన రిషబ్‌ పంత్‌ మాత్రం తన ధనాధన్‌ బ్యాటింగ్‌తో అలరించాడు. మొదటగా శ్రేయాస్‌ హఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో అతనికిది ఐదో హాఫ్‌సెంచరీ. అయ్యర్‌ సహకారంతో బౌండరీలతో రెచ్చిపోయిన పంత్ కూడా హఫ్‌ సెంచరీ చేసాడు. వన్డే కెరీర్‌లో పంత్‌కిదే తొలి అర్ధ శతకం కావడం విశేషం. వరుస వైఫల్యాలపై విమర్శలు ఎదుర్కొంటున్న పంత్‌.. ఓ మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇద్దరూ కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని అందించారు.

మెరిసిన జాదవ్:

మెరిసిన జాదవ్:

అయితే ధాటిగా ఆడే క్రమంలో అయ్యర్ 70 ( 88 బంతుల్లో; 5 ఫోర్లు, ఒక సిక్స్‌)పెవిలియన్ చేరాడు. మరోకొద్దిసేపటికే పంత్ 71 (69 బంతుల్లో; 7 ఫోర్లు, ఒక సిక్స్‌) కూడా ఔట్ అయ్యాడు. ఈ సమయంలో రవీంద్ర జడేజా (21)తో కలిసి కేదార్ జాదవ్ (40) విలువైన పరుగులు చేసాడు. ఇన్నింగ్స్ చివరలో ధాటిగా ఆడే క్రమంలో శివమ్ దూబే (9) ఔట్ అయ్యాడు. దీపక్ చాహర్ (7), మొహమ్మద్ షమీ (0) చివరకు క్రీజులో ఉన్నారు.

Story first published: Sunday, December 15, 2019, 18:26 [IST]
Other articles published on Dec 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X