సెంచరీల మోత: సచిన్-గంగూలీ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ-రోహిత్


హైదరాబాద్: గువహటి వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు సెంచరీలతో మెరిశారు. 85 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో కెరీర్‌లో కోహ్లీ 36వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 36వ సెంచరీ కావడం విశేషం.
వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన వారి జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్(49) తర్వాత స్థానంలో విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. కోహ్లీకి ఇది లక్ష్య ఛేదనలో 22వది. స్వదేశంలో 15వది. కెప్టెన్‌గా 15వది. ఇక కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు చేసిన వారిలో కోహ్లీది రెండో స్థానంలో ఉన్నాడు.

కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో రెండో స్థానంలో కోహ్లీ
ఈ జాబితాలో ఆసీస్ మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ (22) ముందున్నాడు. ఇక, 84 బంతుల్లో 10 ఫోర్లు 5 సిక్స్‌లతో రోహిత్ శర్మ 20వ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఇద్దరు ఆటగాళ్లు ఫోర్‌తోనే సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. ఈ మ్యాచ్‌తో కోహ్లీ అంతర్జాతీయ వన్డేల్లో ఛేజింగ్‌లో 6 వేల పరుగులు పూర్తి చేశాడు. అంతకు ముందు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఒక్కడే ఈ ఘనతను సాధించాడు.

8 వికెట్ల తేడాతో భారత్ విజయం
ఈ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(140), రోహిత్ శర్మ (152 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో భారీ లక్ష్యాన్ని సైతం భారత్ అలవోకగా ఛేదించింది. వెస్టిండిస్ నిర్దేశించిన 323 పరుగుల విజయ లక్ష్యాన్ని 42.1 ఓవర్లలోనే ఛేదించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్(4) రెండో ఓవర్‌లోనే పెవిలియన్ చేరాడు.

కోహ్లీ తొలుత సెంచరీ... తర్వాత రోహిత్ శర్మ
అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. రోహిత్ అందించిన సహకారంతో చెలరేగిపోయాడు. ఇద్దరూ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఒకవైపు రోహిత్ శర్మ కుదురుగా బ్యాటింగ్ చేస్తే, కోహ్లీ మాత్రం బౌండరీల మోత మోగించాడు. దీంతో భారత్ 10 ఓవర్లలోనే 71 పరుగులు చేసింది. అనంతరం తనదైన శైలిలో మెరుపులు మెరిపించిన కోహ్లీ తొలుత సెంచరీ సాధించగా.. అనంతరం రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఇద్దరు కలిసి నాలుగుసార్లు సెంచరీలు
ఈ ఇద్దరు కలిసి నాలుగుసార్లు సెంచరీలు నమోదు చేయడం గమనార్హం. తద్వారా భారత్ తరపున గంగూలీ, టెండూల్కర్‌ల పేరిట ఉన్న ఈ రికార్డును సమం చేశారు. ఈ క్రమంలో కోహ్లీ140 పరుగుల వద్ద బిషూ బౌలింగ్‌లో స్టంపౌట్ కావడంతో రెండో వికెట్‌కు నమోదైన 246 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 322 పరుగులు
కోహ్లీ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు (22 నాటౌట్) రోహిత్‌కు అండగా నిలవడంతో భారత్ 42.1 ఓవర్లలోనే విజయాన్నందుకుంది. వెస్టిండిస్ బౌలర్లలో బిషూ, థోమస్‌లు తలో వికెట్ తీసుకున్నారు. అంతకుముందు టాస్ తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications