Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేడు తొలి వన్డే: ఫేవరెట్‌గా కోహ్లీసేన.. వెస్టిండీస్‌కు సవాల్!!

India vs West Indies: 1st ODI Preview, Dream 11 Prediction, playing 11, live streaming details here

చెన్నై: వెస్టిండీస్‌పై వన్డేల్లో ఎదురులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోన్న టీమిండియా మరోసారి తన సత్తాచాటేందుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న కోహ్లీసేనఅదే ఉత్సాహంతో వన్డే సిరీస్‌ విజయంపై గురి పెట్టింది. చెన్నైలో ఆదివారం జరిగే తొలి వన్డేలో కరీబియన్లను ఓడించి సిరీస్‌పై ఆధిపత్యం చెలాయించాలని పట్టుదలగా ఉంది. ఆఫ్ఘన్‌పై గత సిరీస్‌ను చేజిక్కించుకున్న పొలార్డ్‌ నేతృత్వంలోని విండీస్‌ వన్డేల్లో సత్తాచాటి భారత్‌కు షాకివ్వాలని చూస్తోంది.

రాహుల్‌కే అవకాశం:

రాహుల్‌కే అవకాశం:

రెగ్యులర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ గాయం కారణంగా దూరమవడంతో యువ సంచనలం మయాంక్‌ అగర్వాల్‌ జట్టులోకి వచ్చాడు. అయితే, తుది జట్టులో అతడికి స్థానం దక్కడం కష్టం. టీ20 సిరీస్‌లో విండీస్‌పై రెండు అర్ధ శతకాలు చేసి మరో ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌ (62, 11, 91) ఫామ్‌లోకి వచ్చాడు. దీంతో రోహిత్‌ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ ప్రారంభించే అవకాశంఉంది. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీతో భారత టాపార్డర్‌ దుర్భేద్యంగా ఉంది.

దూబే అరంగేట్రం:

దూబే అరంగేట్రం:

నాలుగో నంబర్‌ స్థానంలో ప్రస్తుతం శ్రేయస్‌ అయ్యర్‌ కుదురుకుంటున్నట్లే కనబడుతున్నాడు. మనీశ్‌ పాండే కూడా సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే పాండేకు అవకాశం దక్కకపోవచ్చు. కేదార్‌ జాదవ్‌ జట్టులో ఉండే అవకాశం ఉంది. ఇక యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌పైనే అందరి దృష్టి ఉండనుంది. ఇప్పటికైనా అతడు ఫామ్‌లోకి రావాలని అభిమానులతో సహా టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కోరుకుంటోంది. రెండో టీ20లో మెరిపించిన శివమ్ దూబే వన్డే అరంగేట్రం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఠాకూర్‌కు చోటు కష్టమే:

ఠాకూర్‌కు చోటు కష్టమే:

చెపాక్‌ పిచ్‌ స్పిన్‌కు అనుకూలించనుడడంతో స్పిన్నర్లు యజువేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌ మరోసారి కీలకంగా మారనున్నారు. గాయపడిన పేసర్‌ భువనేశ్వర్‌ స్థానంలో శార్దూల్‌ ఠాకూర్‌ ఎంపికైనా తుది జట్టులో అతడికి చోటు కష్టమే. మొహమ్మద్‌ షమీ, దీపక్‌ చాహర్‌ పేస్‌ బాధ్యతలను మోయనున్నారు. దూబే సహకరించనున్నాడు. అయితే అదనపు స్పిన్నర్‌ కావాలని మేనేజ్‌మెంట్‌ అనుకుంటే ఆల్‌రౌండర్‌ స్థానం జడేజాకు దక్కనుంది.

పటిష్టంగా బ్యాటింగ్‌:

పటిష్టంగా బ్యాటింగ్‌:

కీరన్‌ పోలార్డ్‌ సారథ్యంలోని వెస్టిండీస్‌ ఇటీవలే భారత గడ్డపైనే వన్డేల్లో ఆఫ్ఘనిస్థాన్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన ఉత్సాహంలో ఉంది. భారత్‌పై టీ20ల్లోనూ బ్యాటింగ్‌లో కరీబియన్లు అదరగొట్టారు. వన్డేల్లోనూ ఆ విభాగంపైనే ఆ జట్టు ఆశలు పెట్టుకోనుంది. ముంబై మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తూ గాయడిన భారీ హిట్టర్‌ ఎవిన్‌ లూయిస్‌ ఆడే అవకాశముంది. పొలార్డ్, షై హోప్, హెట్‌మైర్, నికోలస్‌ పూరన్, కింగ్‌లతో పాటు ఆల్‌రౌండర్‌ రోస్టన్‌ చేజ్‌ కూడా జట్టుతో చేరడంతో విండీస్‌ బ్యాటింగ్‌ పటిష్టంగా మారింది. పేసర్లు కాట్రెల్‌, అల్జరీ జోసెఫ్‌ పంజా విసరాలని చూస్తున్నారు. లెగ్‌ స్పిన్నర్‌ హేడెన్‌ వాల్ష్‌ ప్రభావం చూపనున్నాడు.

జట్లు (అంచనా):

జట్లు (అంచనా):

భారత్‌: రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్, రిషభ్‌ పంత్, కేదార్‌ జాదవ్, శివమ్‌ దూబే, యజువేంద్ర చహల్, కుల్దీప్‌ యాదవ్, మొహమ్మద్‌ షమీ, దీపక్‌ చాహర్‌.

వెస్టిండీస్‌: ఎవిన్‌ లూయిస్‌/బ్రాండన్‌ కింగ్‌, షై హోప్, రోస్టన్‌ చేజ్, హెట్‌మైర్, నికోలస్‌ పూరన్‌, కీరన్‌ పొలార్డ్‌ (కెప్టెన్‌), జాసన్ హోల్డర్‌, కాట్రెల్‌, షెఫర్డ్‌, హేడెన్‌ వాల్ష్‌, జొసెఫ్‌.

Story first published: Sunday, December 15, 2019, 11:28 [IST]
Other articles published on Dec 15, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+