For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ Vs విండిస్, 1st ODI: టీమిండియా ఫీల్డింగ్, 43 ఓవర్లకు మ్యాచ్ కుదింపు

India Vs West Indies: 1st ODI, Live Score: India win the toss and elect to field

హైదరాబాద్: వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైన తొలి వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ని అంపైర్లు మ్యాచ్‌ని కుదించారు. దీంతో ఇరు జ‌ట్లు చెరో 43 ఓవ‌ర్లు ఆడ‌నున్నాయి. మూడు టీ20ల సిరిస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. దీంతో వన్డే సిరీస్‌పై కన్నేసింది.

అంతకముందు ప్రొవిడెన్స్ స్టేడియంలో జోరున వర్షం కురుస్తుండటంతో టాస్ ఆలస్యంగా వేశారు. కాగా, ప్రపంచకప్‌ తర్వాత జరిగిన తొలి టీ20 సిరీస్‌లో అంచనాల్ని మించి రాణించిన కోహ్లీసేన... అదే ఉత్సాహంలో కరేబియన్ గడ్డపై వన్డేల్లో ఢీకొట్టేందుకు సిద్ధమైంది.

1
46124

ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో గాయపడిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ మళ్లీ జట్టులోకి రావడంతో రోహిత్ శర్మతో కలిసి అతను ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టే అవకాశం ఉంది.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల తర్వాత ఈ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ధావన్ కొనసాగుతున్నాడు. శిఖర్ ధావన్ ఇప్పటివరకు మొత్తం 130 వన్డేలు ఆడి 17 సెంచరీలు సాధించాడు. ఈ నేపథ్యంలో వెస్టిండిస్‌తో వన్డే సిరిస్‌లో శిఖర్ ధావన్ మళ్లీ జట్టులోకి రావడంతో కేఎల్ రాహుల్‌ను 4వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

జట్ల వివరాలు:
భార‌త్:
రోహిత్ శ‌ర్మ‌, శిఖ‌ర్ ధావ‌న్‌, విరాట్ కోహ్లి (కెప్టెన్‌), శ్రేయాస్ అయ్య‌ర్‌, రిష‌బ్ పంత్‌, కేదార్ జాద‌వ్‌, ర‌వీంద్ర జ‌డేజా, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, కుల్దీప్ యాద‌వ్, మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ, కె ఖలీల్ అహ్మ‌ద్‌.

వెస్టిండీస్‌: ఎవిన్ లూయీస్‌, క్రిస్ గేల్‌, షై హోప్ (వికెట్ కీప‌ర్‌), నికోలాస్ పూర‌న్‌, షిమ్రాన్ హిట్‌మైర్‌, రోస్ట‌న్ చేజ్‌, జేస‌న్ హోల్డ‌ర్ (కెప్టెన్‌), కార్లోస్ బ్రాత్‌వైట్‌, ఫేబియ‌న్ అలెన్‌, షెల్డాన్ కాట్రెల్‌, కీమ‌ర్ రోచ్‌.

Story first published: Thursday, August 8, 2019, 21:12 [IST]
Other articles published on Aug 8, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+