గువహటిలో తొలి వన్డే: హెట్‌మయెర్ సెంచరీ, భారత్ లక్ష్యం 323

హైదరాబాద్: గువహటి వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండిస్ బ్యాట్స్‌మన్ చెలరేగారు. హెట్‌మెయిర్ (106), కీరన్ పావెల్ (51), హోప్ (32), హోల్డర్ (38)లు రాణించడంతో భారత్‌కు 323 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించారు. భారత బౌలర్లలో చాహల్‌కు మూడు, షమీ, జడేజాలకు రెండు, ఖలీల్ అహ్మద్ ఓ వికెట్ తీశాడు.
ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసిన మహమ్మద్ షమీ దారుణంగా 81 పరుగులు సమర్పించుకున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 19 పరుగుల వద్దే ఓపెనర్ చందర్‌పాల్ హేమ్‌రాజ్ (9) వికెట్ చేజార్చుకుంది. మహ్మద్ షమి అతడిని పెవిలియన్ పంపించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హోప్‌తో కీరన్ పావెల్ దాటిగా ఆడాడు.

10 ఓవర్లకు 59
దీంతో విండీస్ 10 ఓవర్లకు వికెట్ నష్టపోయి 59 పరుగులు చేసింది. ఈ క్రమంలో కీరన్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ప్రమాదకరంగా మారిన కీరన్‌ను యువ బౌలర్ ఖలీల్ అహ్మద్ పెవిలియన్ విడదీశాడు. దీంతో రెండో వికెట్‌కు నమోదైన 65 పరుగుల భాగస్వామ్యానికి

114 పరుగులకే నాలుగు వికెట్లు
మరో రెండు పరుగులకే మార్లోన్ శామ్యూల్‌ను చాహల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకొని డకౌట్ చేశాడు. ఆ వెంటనే షమీ షై హోప్‌ను.. చాహల్ శామ్యుల్‌ను ఔట్ చేయడంతో విండీస్ 114 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. 21 ఓవర్లకే నాలుగు వికెట్లు చేజార్చుకున్నా రన్‌రేట్ మాత్రం తగ్గలేదు.

విండీస్‌ను ఆదుకున్న హెట్‌మెయిర్
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన హెట్‌మెయిర్, రోవ్‌మన్ పావెల్ విండీస్‌ను ఆదుకున్నారు. మిడిలార్డర్‌లో వచ్చిన హెట్‌మెయిర్ (106) భారీ సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డాడు. స్పిన్ బౌలర్లను ఆడుకున్నారు. 41 బంతుల్లో 50 పరుగులు చేసిన అతడు రోవ్‌మన్ పావెల్ (22)తో కలిసి మరింత చెలరేగాడు.

ఐదో వికెట్‌కు 74 పరుగుల కీలక భాగస్వామ్యం
ఐదో వికెట్‌కు 74 పరుగుల కీలక భాగస్వామ్యం అందించాడు. ఈ దశలో రోవ్‌మన్ పావెల్(22)ను జడేజా బౌల్డ్ చేసి పెవిలియన్ చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హోల్డర్ ఆచితూచి ఆడాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా హెట్‌మెయిర్ మాత్రం తన హిట్టింగ్‌ను ఆపలేదు. భారీ షాట్లు బాదుతూనే ఉన్నాడు.

కెరీర్‌లో మూడో సెంచరీ సాధించిన హెట్‌మయెర్ సెంచరీ
భారీ సిక్సర్‌తో 74 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో కెరీర్‌లో మూడో సెంచరీ సాధించాడు. ఈ క్రమంలోనే ఓ భారీ షాట్ ఆడబోయి రవీంద్ర జడేజా వేసిన 38.4వ బంతికి రిషబ్‌పంత్‌కు క్యాచ్ ఇచ్చాడు. చివర్లో బిషూ(22), రోచ్ (26)లు దాటిగా ఆడటంతో విండీస్ నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 322 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications