Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ, రోహిత్ సెంచరీలు: తొలి వన్డేలో భారత్ అలవోక విజయం

 India win by 8 wickets

హైదరాబాద్: గువహటి వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(107 బంతుల్లో 140; 21 ఫోర్లు, 2 సిక్స్‌లు), రోహిత్‌ శర్మ (117 బంతుల్లో 152 నాటౌట్‌; 15 ఫోర్లు, 8 సిక్స్‌లు) సెంచరీలతో చెలరేగడంతో భారీ లక్ష్యాన్ని సైతం భారత్‌ అలవోకగా ఛేదించింది.

 323 పరుగుల విజయ లక్ష్యాన్ని 42.1 ఓవర్లలోనే

323 పరుగుల విజయ లక్ష్యాన్ని 42.1 ఓవర్లలోనే

వెస్టిండిస్ నిర్దేశించిన 323 పరుగుల విజయ లక్ష్యాన్ని 42.1 ఓవర్లలోనే ఛేదించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(4) రెండో ఓవర్‌లోనే పెవిలియన్‌ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. రోహిత్ అందించిన సహకారంతో చెలరేగిపోయాడు. ఇద్దరూ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.

 సెంచరీలు మోత మోగించిన రోహిత్, కోహ్లీ

సెంచరీలు మోత మోగించిన రోహిత్, కోహ్లీ

ఒకవైపు రోహిత్‌ శర్మ కుదురుగా బ్యాటింగ్‌ చేస్తే, కోహ్లీ మాత్రం బౌండరీల మోత మోగించాడు. దీంతో భారత్‌ 10 ఓవర్లలోనే 71 పరుగులు చేసింది. అనంతరం తనదైన శైలిలో మెరుపులు మెరిపించిన కోహ్లీ 88 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 36వ సెంచరీ. ఆ తర్వాత కాసేపటికే రోహిత్ శర్మ కూడా కెరీర్‌లో 20వ సెంచరీ నమోదు చేశాడు.

 కోహ్లీ, రోహిత్‌లు కలిసి నాలుగుసార్లు సెంచరీలు నమోదు

కోహ్లీ, రోహిత్‌లు కలిసి నాలుగుసార్లు సెంచరీలు నమోదు

84 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరు కలిసి నాలుగుసార్లు సెంచరీలు నమోదు చేయడం గమనార్హం. తద్వారా భారత్‌ తరపున గంగూలీ, టెండూల్కర్‌ల పేరిట ఉన్న ఈ రికార్డును సమం చేశారు. ఈ క్రమంలో కోహ్లీ140 పరుగుల వద్ద బిషూ బౌలింగ్‌లో స్టంపౌట్‌ కావడంతో రెండో వికెట్‌కు నమోదైన 246 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

 తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 322/8

తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 322/8

కోహ్లీ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు (22 నాటౌట్‌) రోహిత్‌కు అండగా నిలవడంతో భారత్‌ 42.1 ఓవర్లలోనే విజయాన్నందుకుంది. వెస్టిండిస్ బౌలర్లలో బిషూ, థోమస్‌లు తలో వికెట్‌ తీసుకున్నారు. అంతకుముందు టాస్ తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది.

Story first published: Sunday, October 21, 2018, 21:35 [IST]
Other articles published on Oct 21, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+