For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

81 పరుగులు: తొలి వన్డేలో చెత్త రికార్డుని నమోదు చేసిన షమీ

India vs West Indies, 1st ODI : Mohammed Shami Files Ever Wrost Record In Yesterday's Match
India vs West Indies, 1st ODI at Guwahati: Pacer Mohammed Shami gave 81 runs

హైదరాబాద్: గువహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ ఓ చెత్త రికార్డుని నమోదు చేశాడు. వన్డేల్లో వెస్టిండిస్‌ జట్టుపై అత్యధిక పరుగులు సమర్పించుకున్న భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసిన షమీ 81 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.

ఇప్పటివరకు ఈ చెత్త రికార్డు టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై ఉండగా.. తాజాగా మహమ్మద్ షమీ అధిగమించాడు. 2014లో ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజా 80 పరుగులు సమర్పించుకున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో అమర్‌ నాథ్(79)‌, శ్రీశాంత్‌(79), రవిశాస్త్రి (77)లున్నారు.

1
44266
షమీ ఖాతాలో చెత్త రికార్డు

షమీ ఖాతాలో చెత్త రికార్డు

అమర్‌ నాథ్‌, రవిశాస్త్రిలు 1983లో జంషెడ్‌పూర్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఈ చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకోగా... శ్రీశాంత్‌ 2007లో నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం గువహటి వేదికగా జరిగిన మ్యాచ్‌లో షమీ ధారాళంగా పరుగులివ్వడంతో హెట్‌మెయిర్‌ సెంచరీ సాధించాడు.

ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన హెట్‌మెయిర్‌

ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన హెట్‌మెయిర్‌

74 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వన్డేల్లో అతనికిది మూడోది కావడం విశేషం. ఈ సెంచరీతో భారత్‌పై అత్యంత వేగంగా సెంచరీ సాధించిన నాలుగో విండీస్‌ బ్యాట్స్‌మన్‌గా హెట్‌మెయిర్‌ అరుదైన ఘనత సాధించాడు. ఈ జాబితాలో వివ్‌ రిచర్డ్స్‌ 72 బంతుల్లో సెంచరీ సాధించి తొలి స్థానంలో ఉండగా.. రికార్డో పావెల్‌ సైతం 72 బంతుల్లోనే ఈ ఫీట్‌ను సాధించి ఆ తర్వాతి స్థానంలో ఉన్నాడు.

మూడు సెంచరీలు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌

మూడు సెంచరీలు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌

శామ్యూల్స్‌ 73 బంతుల్లో సెంచరీ సాధించగా... తాజాగా హెట్‌మెయిర్‌ 74 బంతుల్లో సెంచరీ సాధించాడు. తద్వారా వెస్టిండిస్‌ తరపున వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. మూడు సెంచరీలు చేసేందుకు గాను హెట్‌మయెర్‌కు 13 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి.

భారత్‌పై విండీస్‌కు ఇది నాలుగో భారీ స్కోరు

భారత్‌పై విండీస్‌కు ఇది నాలుగో భారీ స్కోరు

వివ్‌ రిచర్డ్స్‌‌కు 16, గ్రీనిడ్జే 27, సిమన్స్‌ 41 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించారు. ఇక హెట్‌మెయిర్‌కు భారత్‌తో ఇదే తొలి వన్డే మ్యాచ్‌ కావడం విశేషం. హెట్‌మెయిర్‌ సెంచరీ సాధించడంతో ఆతిథ్య భారత జట్టుకు వెస్టిండిస్ 323 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్‌పై విండీస్‌కు ఇది నాలుగో భారీ స్కోరు కావడం విశేషం.

 తొలి వన్డేలో భారత్ 8 పరుగుల తేడాతో విజయం

తొలి వన్డేలో భారత్ 8 పరుగుల తేడాతో విజయం

1983 జంషెడ్‌పూర్‌ వన్డేలో 333/8 భారీ స్కోర్‌ నమోదు చేసిన విండీస్‌.. 2002 అహ్మదాబాద్‌ వన్డేలో 324/4, 2007 నాగ్‌పూర్‌ వన్డేలో 324/8 పరుగులు చేసింది. విండిస్ నిర్దేశించి భారీ లక్ష్యాన్ని భారత్ 42.1 ఓవర్లలోనే ఛేదించింది. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(107 బంతుల్లో 140; 21 ఫోర్లు, 2 సిక్స్‌లు), రోహిత్‌ శర్మ (117 బంతుల్లో 152 నాటౌట్‌; 15 ఫోర్లు, 8 సిక్స్‌లు) సెంచరీలతో చెలరేగడంతో తొలి వన్డేలో భారత్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Story first published: Monday, October 22, 2018, 12:13 [IST]
Other articles published on Oct 22, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+