భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య హెడ్ టు హెడ్ రికార్డులు.. ఆసియాకప్ టోర్నీలో మాత్రం శ్రీలంక చాలా టఫ్ గురూ?

తమ మొదటి సూపర్ 4 గేమ్‌లో పాకిస్థాన్‌తో ఓడిపోయిన భారత్.. శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్‌లపై మిగిలిన రెండు మ్యాచ్‌లను తప్పకుండా గెలిస్తేనే ఫైనల్ చేరుతుంది. రవీంద్ర జడేజా గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి వైదొలగడంతో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో జట్టు కూర్పులో కాస్త ఇబ్బంది నెలకొంది. ఇక బ్యాటింగ్ పరంగా భారత మిడిల్ ఆర్డర్లో మరింత నిలకడ అవసరం. హార్దిక్ పాండ్యా, పంత్, సూర్య కీలక మ్యాచ్‌లలో మరింత మంచి ప్రదర్శనలు ఇవ్వాల్సిన అవసరముంది. రేపు శ్రీలంకతో ఇండియా సూపర్ 4 మ్యాచ్ ఆడబోతుంది. దసున్ షనక నేతృత్వంలోని శ్రీలంక మంచి ఊపు మీదుంది. వారు వరుసగా రెండు మ్యాచ్‌లలో 175కంటే ఎక్కువ స్కోరులను ఛేదించి జట్టుగా సమిష్టి ప్రదర్శన కనబర్చుతున్నారు. కుశాల్ మెండిస్ మంచి ఫామ్ కొనసాగిస్తుండడం, లోయర్ ఆర్డర్లో కీలక పరుగులు చేయగల ప్లేయర్లు ఉండడం ఆ జట్టుకు కలిసొస్తుంది. ఇక ఈ మ్యాచ్ విషయంలో టాస్ గెలిచిన కెప్టెన్ తప్పకుండా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంటాడు. మరో హై స్కోరింగ్ మ్యాచ్ మనం ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.

టీ20లల్లో ఇండియాదే ఆధిపత్యం, ఆసియా కప్‌లో మాత్రం
ఇకపోతే భారత్ వర్సస్ శ్రీలంక మధ్య ఇప్పటి వరకు 25 టీ20 మ్యాచ్‌లు జరగగా అందులో భారత్ 17 మ్యాచ్‌లలో గెలుపొందింది. శ్రీలంక 7 గెలుపొందింది. ఒకటి టై అయింది. టీ20 ఫార్మాట్లో భారత్ శ్రీలంక కంటే 10 మ్యాచ్‌ల విన్నింగ్‌తో ఆధిక్యం కనబర్చుతుంది. ఇకపోతే ఆసియా కప్ విషయానికొస్తే.. ఇరు జట్లు టఫ్ పోటీని కనబర్చాయి. ఇప్పటివరకు వన్డే, టీ20 ఫార్మాట్లో ఇరు జట్ల మధ్య 20 మ్యాచ్‌లు ఆసియా కప్‌లో జరగగా అందులో భారత్ 10 గెలవగా, శ్రీలంక 10 గెలుపొందింది. దీంతో ఇరు జట్లు ఈ టోర్నీలో టఫ్ అండ్ టఫ్ పోటీని కనబర్చే వీలుంది.

గత అయిదు మ్యాచ్‌లలో ఇండియా 3, శ్రీలంక 2
ఇకపోతే భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య గత 5 మ్యాచ్‌ల ప్రదర్శనను ఓసారి పరిశీలిస్తే.. 2022 ఫిబ్రవరి 27న ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో ఇరు జట్ల మధ్య జరిగిన చివరి పోరులో భారత్ 6 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. అంతకుముందు రెండు టీ20 మ్యాచ్‌లో భారత్ 7 వికెట్లతో ఓసారి, 62పరుగుల తేడాతో మరోసారి విజయం సాధించింది. ఇక గత 4వ మ్యాచ్‌లో మాత్రం శ్రీలంక 7వికెట్ల తేడాతో గెలుపొందింది. అంతకుముందు కూడా శ్రీలంక 4వికెట్ల తేడాతో గెలుపొందింది.

తుది జట్ల అంచనా :
భారత్ ప్లేయింగ్ 11 : రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్
శ్రీలంక ప్లేయింగ్ 11: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, చరిత్ అసలంక, దనుష్క గుణతిలక, దసున్ షనక (కెప్టెన్), భానుక రాజపక్సే, వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, అసిత ఫెర్నాండో, దిల్షన్ మధుశంక
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications