India vs Srilanka: భారత్‌తో టీ20 సిరీస్‌కు శ్రీలంక జట్టు ఎంపిక.. కెప్టెన్‌గా దాసున్ షనక

భారత పర్యటనలో టీ20 సిరీస్‌కు శ్రీలంక క్రికెట్ బోర్డు తమ టీంను ప్రకటించింది. మొత్తం 18 మందితో కూడిన జట్టుకు దాసున్ షనకను కెప్టెన్‌గా నియమించింది. వైస్ కెప్టెన్సీ బాధ్యతలను చరిత్ అసలంకకు అప్పగించింది. ఇక గాయాల కారణంగా అవిష్క ఫెర్నాండో, నువాన్ తుషార, రమేష్ మెడిస్ ఈ సిరీస్‌కు దూరంగా ఉంటున్నారు. కుశాల్ మెండిస్, పాతుమ్ నిస్సాంక, దినేష్ చండిమాల్, దనుష్క గుణతిలక వంటి వారు జట్టులో ఉన్నారు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో 10.75 కోట్ల రూపాయల భారీ ధరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసిన వనీందు హసరంగ శ్రీలంక బౌలింగ్ యూనిట్‌ను లీడ్ చేయనున్నాడు.
చెన్నైసూపర్ కింగ్స్ కొనుగోలు చేసిన మహేష్ తీక్షణతోపాటు జెఫ్రీ వాండర్సే, ఆఫ్ స్పిన్నర్ అషియాన్ డేనియల్ లంక జట్టులో ఉన్నారు. కాగా ఇటీవల ఆస్ట్రేలియా గడ్డపై టీ20 సిరీస్‌లో 1-4 తేడాతో ఓడిన శ్రీలంక.. భారత పర్యటనకు బయలుదేరింది. భారత్, శ్రీలంక మధ్య ఈ నెల 24, 26, 27వ తేదీలలో లక్నో, ధర్మశాల వేదికగా 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. టీ20 సిరీస్ ముగిశాక ఇరు జట్ల మధ్య 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కూడా జరగనుంది. ఈ టెస్టు సిరీస్‌కు మొహాలీ, బెంగళూరు వేదికలుగా ఎంపికయ్యాయి.

శ్రీలంక జట్టు
దాసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిస్సంక, కుసాల్ మెండిస్, చరిత్ అసలంక (వైస్-కెప్టెన్), దినేష్ చండిమాల్, దనుష్క గుణతిలక, కమిల్ మిషారా, జనిత్ లియానగే, వానిందు హసరంగా, చామికా కరుణరత్నే, దుష్మంత చమీర, లహిరు కుమార, బినూర ఫెర్నాండో, షిరాన్ ఫెర్నాండో, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, ప్రవీణ్ జయవిక్రమ, ఆషియాన్ డేనియల్.

భారత టీ20 జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, సంజూ శాంసన్, రవీంద్ర జడేజా, యజుర్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, కుల్దీప్, అవేశ్ ఖాన్.

టెస్టు సిరీస్‌కు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పాంచల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, కేఎస్ భరత్, అశ్విన్, జడేజా, జయంత్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, సౌరభ్ కుమార్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications