న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అశ్విన్ రికార్డుకు వికెట్ దూరంలో యజువేంద్ర చాహల్

By Nageshwara Rao
India vs Sri Lanka: Yuzvendra Chahal Sets Sight on R Ashwin's Record in Mumbai T20I

హైదరాబాద్: శ్రీలంకతో ముంబై వేదికగా ఆదివారం జరగనున్న మూడో టీ20లో టీమిండియా మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఓ అరుదైన రికార్డుని అందుకోనున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఘనత అందుకున్న చాహల్.. భారత వెటరన్ స్పిన్నర్ అశ్విన్‌ రికార్డుకి ఒక వికెట్ దూరంలో నిలిచాడు.

2016లో రవిచంద్రన్ అశ్విన్ 23 వికెట్లతో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సాధించాడు. తాజాగా చాహల్ 11 మ్యాచ్‌ల్లోనే 23 వికెట్లు తీసి అశ్విన్ రికార్డుని సమం చేశాడు. మూడు టీ20ల సిరిస్‌లో చివరిదైన మూడో టీ20 ఆదివారం రాత్రి వాంఖడెలో జరగనుంది.

వాంఖడెలో చాహల్ మరో వికెట్ తీస్తే ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అరుదైన ఘనత సృష్టించనున్నాడు. ఈ జాబితాలో చాహల్ తర్వాత స్థానంలో అఫ్గానిస్థాన్ బౌలర్ రషీద్ ఖాన్ 17 వికెట్లతో ఉన్నాడు.

2017లో టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితా:

1. యజ్వేంద్ర చాహల్‌: 11 మ్యాచుల్లో 23 వికెట్లు
2. రషీద్‌ ఖాన్‌: 10 మ్యాచుల్లో 17 వికెట్లు
3. కెర్సిక్‌ విలియమ్స్‌: 9 మ్యాచుల్లో 17 వికెట్లు
4. షాబాద్‌ ఖాన్‌ : 10 మ్యాచుల్లో 14 వికెట్లు
5. ఇమ్రాన్‌ తాహిర్‌: 9 మ్యాచుల్లో 14 వికెట్లు

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, December 24, 2017, 18:03 [IST]
Other articles published on Dec 24, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X