IND vs SL: ఆ వరల్డ్ క్లాస్ స్పిన్నర్‌కు మళ్లీ మొండిచేయేనా?
IND vs SL: భారత జట్టు శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు సిద్ధంగా ఉంది. ఈ టెస్ట్ సిరీస్‌కు ముందు తుది జట్టులో స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంపై ప్రశ్నలు తలెత్తాయి. శ్రీలంక క్రికెట్ ఎలెవన్‌తో జరిగిన 3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేయలేదు. ఫిట్‌నెస్ సమస్యలేమీ లేవని జట్టు యాజమాన్యం స్పష్టం చేసినప్పటికీ.. ఓ ప్రధాన ప్రశ్న మిగిలి ఉంది. ఆగస్టు 15న గాలేలో ప్రారంభమయ్యే మొదటి టెస్ట్ మ్యాచ్‌కు కుల్దీప్ యాదవ్ అర్హత సాధిస్తాడా లేక మరోసారి జట్టుకు దూరమవుతుడా అనే అనే అనుమానాలు నెలకొన్నాయి.
ఎందుకంటే ఇటీవల కుల్దీప్ యాదవ్ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. కుల్దీప్ యాదవ్ ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌కు భారత జట్టులో భాగంగా ఉన్నప్పటికీ.. మూడు మ్యాచ్‌ల్లోనూ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇప్పుడు స్పిన్‌కు అనుకూలమైన శ్రీలంక పరిస్థితులలో కూడా కుల్దీప్ యాదవ్‌కు అవకాశం లభించకపోతే.. అతడి ఎంపికపై చర్చ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. శ్రీలంక క్రికెట్ ఎలెవన్‌తో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ మొదటి ఇన్నింగ్స్‌లో 18 ఓవర్లు బౌలింగ్ చేసి 2 వికెట్లు తీశాడు. అయితే కుల్దీప్ రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయలేదు. రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, సరాన్ష్ జైన్ బౌలింగ్ చేశారు. టెస్ట్ సిరీస్‌కు కొద్ది రోజుల ముందు కుల్దీప్ యాదవ్ అందుబాటులో లేకపోవడం కుల్దీప్ ఫిట్‌నెస్‌పై ప్రశ్నలు తలెత్తాయి.

కుల్దీప్ యాదవ్ గురించి బౌలింగ్ కోచ్ ఏమన్నారంటే?
కుల్దీప్ యాదవ్ ఫిట్‌నెస్‌పై వ్యక్తమవుతున్న స్పిన్ బౌలింగ్ కోచ్ సైరాజ్ బహుతులే కొట్టిపారేశారు. కుల్దీప్ యాదవ్‌కు ఎలాంటి కొత్త గాయాలూ కాలేవని ఆయన స్పష్టం చేశారు. ప్రాక్టీస్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనే కుల్దీప్ యాదవ్ 18 ఓవర్లు బౌలింగ్ చేసి 2 వికెట్లు పడగొట్టాడని.. అలాగే మ్యాచ్ ప్రారంభానికి ముందే నెట్స్ లో మరో 2-3 ఓవర్లు బౌలింగ్ చేశాడని తెలిపారు. " మొత్తంగా దాదాపు 20 ఓవర్లు బౌలింగ్ చేసిన తర్వా, తన శరీర స్పందనను అంచనా వేసుకోవడానికి కుల్దీప్ యాదవ్ చిన్న విరామం తీసుకున్నాడు. సుదీర్ఘ కాలం తర్వాత స్టేడియంలోకి వచ్చినందున ఇది కేవలం వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ లో భాగమే" అని సైరాజ్ బహుతులే వివరించారు. దీంతో రెండో ఇన్నింగ్స్ లో మానవ్ సుతార్, సరాన్ష్ జైన్‌లకు ఎక్కువ బౌలింగ్ అవకాశాలు లభించాయి.
9 ఏళ్ల కెరీర్.. కేవలం 18 టెస్టులు మాత్రమే!
కుల్దీప్ యాదవ్ ఇంటర్నేషనల్ కెరీర్లో అతడికి లభిస్తున్న అవకాశాలు, అద్భుతమన రికార్డు మధ్య ఉన్న వైరుధ్యం ఎల్లప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటోంది. మార్చి 2017లో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన కుల్దీప్ యాదవ్ దాదాపు 9 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో కేవలం 18 టెస్టులు మాత్రమే ఆడగలిగాడు. అయినప్పటికీ 22.35 సగటుతో 79 వికెట్లు తీసి తనదైన ముద్ర వేశాడు. వన్డేల్లో 194 వికెట్లు, టీ20ల్లో 95 వికెట్లు పడగొట్టిన రికార్డు కుల్దీప్ యాదవ్ సొంతం. మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ.. జట్టు కూర్పు కారణాల వల్ల కుల్దీప్ తరచుగా తుది జట్టుకు దూరమవుతుండటం గమనార్హం. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలోని వన్డే సిరీస్ లోనూ కుల్దీప్ మొత్తం బెంచ్ కే పరిమితమయ్యాడు.
పోటీగా రవీంద్ర జడేజా
రవీంద్ర జడేజా బ్యాట్, బాల్ రెండింటితోనూ రాణించగలడు. దీంతో రవీంద్ర జడేజా తుది జట్టులో స్థానం కోసం బలమైన పోటీదారుగా ఉన్నాడు. భారత్ ఎంత మంది స్పిన్నర్లను బరిలోకి దించుతుందనే దానిపైనే అసలైన నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ జట్టు ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగితే కుల్దీప్ యాదవ్ అవకాశాలు బలపడవచ్చు. అయితే బ్యాటింగ్ లైనప్ లోతును బట్టి లేదా అదనపు పేసర్ కు ప్రాధాన్యత ఇవ్వడాన్ని బట్టి సమీకరణం మారవచ్చు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో మానవ్ సుతార్, సరాన్ష్ జైన్ లకు ఎక్కువగా బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వాలన్న నిర్ణయం కూడా జట్టు యాజమాన్యం తమ ప్రత్యామ్నాయాలను తెరిచి ఉంచాలని కోరుకుంటున్నట్లు సూచిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

