T Natarajan శ్రీలంక పర్యటనకు దూరం.. అసలు కారణం ఇదే?

Shikhar Dhawan to lead India on limited-overs tour of Sri Lanka | Oneindia Telugu

హైదరాబాద్: జూలైలో శ్రీలంక పర్యటన సందర్భంగా గురువారం బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత​ సీనియర్‌ జట్టు ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లడంతో.. సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ సారధ్యంలో టీమిండియా రెండో జట్టు లంకతో సిరీస్‌ ఆడనుంది. ఐపీఎల్‌, దేశవాలీ టోర్నీలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా శ్రీలంక పర్యటనలో యువ ఆటగాళ్లకు చోటు కల్పించారు. రుతురాజ్‌ గైక్వాడ్, దేవదత్‌ పడిక్కల్‌, చేతన్‌ సకారియా, కృష్ణప్ప గౌతమ్‌, నితీష్‌ రాణా వంటి యువ ఆటగాళ్లు తొలిసారి భారత జాతీయ జట్టుకు ఎంపికయ్యారు.

సర్జరీ కారణంగా

సర్జరీ కారణంగా

అయితే టీమిండియా స్టార్ పేసర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ యార్కర్ల కింగ్ టీ నటరాజన్‌ శ్రీలంక పర్యటనకు ఎంపికవ్వలేదు. ఇందుకు కారణం అతడు ఇంకా శస్త్రచికిత్స నుంచి కోలుకోలేదు. ఐపీఎల్ 2021 సీజన్ సందర్భంగా మోకాలి గాయానికి గురైన నట్టూ.. తొలుత బెంచ్‌కు పరిమితమయ్యాడు.

కానీ సర్జరీ చేయాల్సిందేనని నిపుణులు తేల్చడంతో.. అతను అర్థాంతరంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఏప్రిల్ చివరలో సర్జరీ చేసుకున్న నట్టూ.. ఇప్పుడు తగిన విశ్రాంతి తీసుకుంటున్నాడు. అందుకే బీసీసీఐ అతడిని శ్రీలంక పర్యటనకు ఎంపికచేయలేదు. ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌ ఆడటం కష్టమే అని సమాచారం.

అయ్యర్ కూడా

అయ్యర్ కూడా

ఇక టీమిండియా యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయాస్ అయ్యర్ కూడా శ్రీలంక పర్యటనకు ఎంపికవలేదు. ఐపీఎల్‌ 2021 ముందు ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో శ్రేయస్‌ భుజానికి తీవ్ర గాయమైంది. మార్చి 26న ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో బౌండరీని ఆపే క్రమంలో అయ్యర్ ఎడమ భుజానికి గాయమైంది. ఏప్రిల్‌ 8న అయ్యర్‌ భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. సర్జరీ తర్వాత అతడు పూర్తిగా కోలుకోవడానికి కనీసం 120 నుంచి 150 రోజులు పట్టే అవకాశం ఉందని డాక్టర్లు అప్పుడే తేల్చేశారు. ఇప్పటికీ అతడు పూర్తిస్థాయిలో కోలుకోలేదు. దీంతో లంక పర్యటనకు అతడు కూడా దూరమయ్యాడు.

'యాషెస్‌ సిరీస్‌ కన్నా..భారత్‌-పాక్‌ మ్యాచ్‌లనే ఎక్కువగా చూస్తారు!దాయాదుల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగాలి'

20 మందితో లంకకు

20 మందితో లంకకు

లంక పర్యటనలో భారత జట్టుకు సీనియర్‌ ఓపెనర్ శిఖర్‌ ధావన్ సారథ్యం వహించనున్నాడు. ఇక సీనియర్ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ టూర్‌కు 20 మంది సభ్యుల జట్టును బీసీసీఐ ప్రకటించింది. పృథ్వీ షా, కుల్దీప్‌ యాదవ్‌, యజువేంద్ర చహల్‌ భారత జట్టులోకి పునరాగమనం చేశారు. మనీష్‌ పాండే, సంజు శాంసన్‌ కూడా జట్టులోకి వచ్చారు. లంక పర్యటనకు తాను కచ్చితంగా ఎంపికవుతానని ఆశించిన సీనియర్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌కు షాక్ తగిలింది.

భారత జట్టు

భారత జట్టు

శిఖర్‌ ధావన్‌ (కెప్టెన్‌), భువనేశ్వర్‌ కుమార్ (వైస్‌ కెప్టెన్‌), పృథ్వీ షా, దేవదత్‌ పడిక్కల్‌, హార్దిక్ పాండ్యా, రుతురాజ్‌ గైక్వాడ్‌, సూర్యకుమార్‌ యాదవ్, మనీష్‌ పాండే, నితీష్‌ రాణా, ఇషాన్‌ కిషన్‌, సంజు శాంసన్‌, యుజ్వేంద్ర చహల్‌, రాహుల్‌ చహర్‌, కృష్ణప్ప గౌతమ్‌, కృనాల్‌ పాండ్యా, కుల్దీప్ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, దీపక్‌ చహర్‌, నవ్‌దీప్‌ సైనీ, చేతన్‌ సకారియా.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, June 11, 2021, 11:54 [IST]
Other articles published on Jun 11, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X