రోహిత్ డబుల్ స్పెషల్: ముద్దులు... పెళ్లి రోజు గిఫ్ట్... ఉద్వేగానికి గురైన భార్య
హైదరాబాద్: మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ భార్య రితిక ఒకింత ఉద్వేగానికి గురైంది. శ్రీలంకతో జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరిస్ నుంచి రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో అతడి స్థానంలో తాత్కాలిక కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. మొహాలీ వేదికగా బుధవారం ప్రారంభమైన రెండో వన్డేలో ఓపెనర్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు.
కెప్టెన్‌గా రోహిత్ శర్మకి ఇది తొలి డబుల్ సెంచరీ
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 115 బంతుల్లో 9 పోర్లు, ఒక సిక్సు సాయంతో సెంచరీని నమోదు చేశాడు. తొలి వన్డేలో కేవలం రెండు పరుగులకే ఔటై నిరాశపరిచిన రోహిత్ శర్మ రెండో వన్డేలో డబుల్ సెంచరీ నమోదు చేశాడు. కెప్టెన్‌గా రోహిత్ శర్మకి ఇది తొలి డబుల్ సెంచరీ. డబుల్ సెంచరీ చేసిన తన భర్త రోహిత్ శర్మను చూసి గ్యాలరీలో ఉన్న రితిక ఒకింత ఉద్వేగానికి గురైంది. లేచి నిల్చుని చప్పట్లతో భర్తను అభినందించింది. అనంతరం రోహిత్ శర్మ సైతం తన ఆనందాన్ని మైదానం నుంచే భార్య రితికతో పంచుకున్నాడు.

భార్య రితికకు గాల్లో ముద్దులు విసిరిన రోహిత్ శర్మ
రితికకు గాల్లో ముద్దులు విసిరాడు. రోహిత్ శర్మ జీవితంలో ఈ రోజుకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ రోజు (బుధవారం) రోహిత్ రెండో పెళ్లిరోజు. 2015 డిసెంబర్ 13న రోహిత్ తన మేనేజర్ అయిన రితికను వివాహం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే సెంచరీని పూర్తి చేసిన తర్వాత రోహిత్ చెలరేగిపోయి ఆడాడు.

40వ ఓవర్లో సెంచరీ, 50 ఓవర్‌లో డబుల్ సెంచరీ
40వ ఓవర్లో సెంచరీని పూర్తి చేసిన రోహిత్ 50వ ఓవర్లో డబుల్ ను పూర్తి చేశాడంటే.. బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో.. రోహిత్ శర్మ 36 బంతుల్లోనే వంద పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో 115వ బంతికి రోహిత్ సెంచరీ పూర్తి అయ్యింది. 151వ బంతికి రోహిత్ డబుల్ పూర్తి అయ్యింది. అంటే కేవలం 36 బంతుల్లోనే రోహిత్ శర్మ 101 పరుగులు చేశాడు.

ఓపెనర్‌గా బరిలోకి దిగి 50 ఓవర్ల పాటు క్రీజులో
కాగా, ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ 50 ఓవర్ల పాటు క్రీజులో ఉండి 153 బంతుల్లో 13 ఫోర్లు, 12 సిక్సులతో 208 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తద్వారా వన్డే క్రికెట్ చరిత్రలోనే మూడో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. గతంలో రోహిత్‌శర్మ ఆస్ట్రేలియా, శ్రీలంకపై డబుల్ సెంచరీలు చేశాడు. ఇదే శ్రీలంకపై కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో 264 పరుగులు చేశాడు. వన్డేల్లో ఇప్పటికీ ఇదే అత్యధిక స్కోరుగా ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications