Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మరోసారి కాలుష్యం: మైదానంలో వాంతులు చేసుకున్న లంక క్రికెటర్

హైదరాబాద్: ఢిల్లీలో గాలి కాలుష్యం కారణంగా శ్రీలంక పేసర్ సురంగ లక్మల్‌ మరోసారి అస్వస్థతకు గురయ్యాడు. మంగళవారం ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో వాంతులు చేసుకున్నాడు. దీంతో అతడి బదులు షనక మాస్క్‌తో వచ్చి ఫీల్డింగ్ చేశాడు. అనంతరం లక్మల్ ఇబ్బందులు గమనించిన మిగతా లంక ఆటగాళ్లు కూడా ముఖానికి మాస్కులు తగిలించుకొని ఫీల్డింగ్ చేశారు.

మరోసారి వాంతులు చేసుకున్న క్రికెటర్

మరోసారి వాంతులు చేసుకున్న క్రికెటర్

ఫిరోజ్‌షా కోట్లా వేదికగా భారత్‌-శ్రీలంక జట్ల మధ్య మూడో టెస్టు నాలుగో రోజు ఆట కొనసాగుతోంది. ఓవర్ నైట్ స్కోరు 356/9 ఆటను ప్రారంభించిన పర్యాటక జట్టు మరో 17 పరుగులు జోడించి చివరి వికెట్ కోల్పోయింది. అనంతరం భారత్‌ తన రెండో ఇన్నింగ్స్ కోసం బ్యాటింగ్‌ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో గాలిలో ఆక్సిజన్‌ శాతం తగ్గి కాలుష్యం స్థాయిలు పెరగడంతో లంక బౌలర్‌ సురంగ లక్మల్‌ మరోసారి వాంతులు చేసుకున్నాడు.

Kotla Test: Lanka's Lakmal leaves field sick on Day 4
 మ్యాచ్ ఆడలేమని లంక క్రికెటర్లు

మ్యాచ్ ఆడలేమని లంక క్రికెటర్లు

వాయు కాలుష్యంగా కారణంగా శ్వాస తీసుకోవడం కష్టంగా మారిందని, మ్యాచ్ ఆడలేమని లంక క్రికెటర్లు పదే పదే అంపైర్లకు ఫిర్యాదు చేశారు. ఆదివారం రెండో రోజు ఆటలో లక్మల్‌ ఓవర్‌ పూర్తి చేయలేక ఐదో బంతి వేయగానే పెవిలియన్‌కు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అనంతరం డ్రెస్సింగ్‌ రూమ్‌లో వాంతి చేసుకున్నాడు. ఈ విషయాన్ని శ్రీలంక జట్టు కోచ్ పోథిస్ అధికారికంగా మీడియా సమావేశంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

 ఈసారి మైదానంలోనే వాంతి చేసుకున్నాడు

ఈసారి మైదానంలోనే వాంతి చేసుకున్నాడు

తాజాగా నాలుగో రోజు ఆటలో కూడా లక్మల్‌ మరోసారి వాంతి చేసుకోవడం విశేషం. అయితే ఈసారి మైదానంలో వాంతి చేసుకోవడం విశేషం. మరోవైపు గత నాలుగు రోజులుగా గాలిలో కాలుష్యం తీవ్రత ఎక్కువగానే ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది.

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సైతం ఆగ్రహం

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సైతం ఆగ్రహం

అయితే ఇది 150కి పైగా ఉంటే అనారోగ్యకరమైనదిగా భావిస్తారు. గాలి నాణ్యత సూచిపై ఆదివారం 338 చూపించగా అది సోమవారం 400 దాటింది. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ కూడా కాలుష్య స్థాయి ప్రమాదకర స్థితికి చేరుకున్నప్పటికీ మ్యాచ్‌ను ఎందుకు నిర్వహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Story first published: Tuesday, December 5, 2017, 15:09 [IST]
Other articles published on Dec 5, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+