Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తొలి టీ20లో సాధ్యపడలా? కనీసం ఇండోర్‌లోనైనా!: ప్రపంచ రికార్డుకు పరుగు దూరంలో కోహ్లీ

India vs Sri Lanka: Virat Kohli on cusp of scripting World T20I record in Indore

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. మరో పరుగు సాధిస్తే టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ ప్రపంచ రికార్డు సాధిస్తాడు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా మంగళవారం రాత్రి శ్రీలంకతో టీమిండియా రెండో టీ20కి సిద్ధమైంది.

ఈ మ్యాచ్‌లో కోహ్లీ గనుక ఒక పరుగు చేస్తే టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం అంతర్జాతీయ టీ20 పరుగుల్లో రోహిత్‌ శర్మతో కలిసి విరాట్ కోహ్లీ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 104 టీ20ల్లో 2,633 పరుగులు సాధించగా... విరాట్ కోహ్లీ 75 మ్యాచుల్లోనే ఈ పరుగులు చేయడం విశేషం.

రోహిత్ శర్మను దాటే అవకాశం

రోహిత్ శర్మను దాటే అవకాశం

శ్రీలంకతో ప్రారంభమయ్యే మూడు టీ20ల సిరిస్ నుంచి సెలక్టర్లు రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మను దాటే అవకాశం విరాట్ కోహ్లీకి లభించింది. గువహటి వేదికగా ఆదివారం శ్రీలంకతో జరిగే తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కావడంతో విరాట్ కోహ్లీ ఈ రికార్డుని మిస్సయ్యాడు. దీంతో ఇండోర్ వేదికగా మంగళవారం జరిగే రెండో టీ20లోనైనా కోహ్లీ ఈ రికార్డు అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

రోహిత్‌‌తో పాటు పేసర్ మహ్మద్‌ షమికి విశ్రాంతి

రోహిత్‌‌తో పాటు పేసర్ మహ్మద్‌ షమికి విశ్రాంతి

శ్రీలంకతో మూడు టీ20ల సిరిస్‌కు రోహిత్‌ శర్మతో పాటు పేసర్ మహ్మద్‌ షమికి కూడా సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. భువనేశ్వర్‌ కుమార్‌, దీపక్‌ చాహర్‌కు గాయమవ్వడంతో నవదీప్‌ సైని, శార్దూల్‌ ఠాకూర్‌ జట్టులోకి వచ్చారు. మరోవైపు గాయం నుంచి కోలుకున్న ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా జట్టులోకి వచ్చాడు. రెండో టీ20 మంగళవారం ఇండోర్ వేదికగా జరగనుండగా, 10వ తేదీన పూణె వేదికగా మూడో టీ20 జరగనుంది.

భారత పర్యటనకు శ్రీలంక జట్టు:

భారత పర్యటనకు శ్రీలంక జట్టు:

లసిత్ మలింగ(కెప్టెన్), దనుష్క గుణతిలక, అవిష్క ఫెర్నాండో, ఏంజెలో మాథ్యూస్‌, దసున్‌ శనక, కుశాల్‌ పెరీరా, నిరోషన్‌ డిక్వెలా, ధనంజయ డిసిల్వా, ఇసుర ఉదాన, భనుక రాజసక్స, ఒషాద ఫెర్నాండో, హసరంగ, లహిరు కుమార, కుశాల్‌ మెండిస్‌, సందకన్‌, కసున రజిత.

లంకతో టీ20 సిరిస్‌కు టీమిండియా:

లంకతో టీ20 సిరిస్‌కు టీమిండియా:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శివం దుబే, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీద్ బుమ్రా, నవ్‌ద్రిత్ బుమ్రా మనీష్ పాండే, వాషింగ్టన్ సుందర్, సంజు సామ్సన్.

Story first published: Tuesday, January 7, 2020, 15:57 [IST]
Other articles published on Jan 7, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+