Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Sri Lanka: విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్‌.. ప్రేక్ష‌కులు లేకుండానే వందో టెస్టు

India vs Sri Lanka: Virat Kohli does not allow spectators to the 100th Test match

మొహాలీ: ఇటీవ‌ల విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి త‌ప్పుకోవ‌డంతో sఅత‌డి అభిమానులు తీవ్ర నిరాశ‌లో ఉన్నారు. ఇంత‌లోనే కోహ్లీ అభిమానుల‌ను మ‌రింత నిరాశ‌కు గురి చేసే వార్త ఒక‌టి బ‌య‌టికి వ‌చ్చింది. కోహ్లీ 100వ టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నున్న మొహాలీ మైదానంలోకి ప్రేక్ష‌కుల‌ను అనుమతించడం లేద‌ని పంజాబ్ క్రికెట్ అసోసియేష‌న్ వెల్ల‌డించింది. దీంతో కోహ్లీ వందో టెస్టు కోసం ఆత్రుత‌గా ఎదురుచూస్తున్న అభిమానుల‌కు బిగ్ షాక్ త‌గిలిన‌ట్టైంది. మార్చి 4 నుంచి భార‌త్‌, శ్రీ‌లంక మ‌ధ్య జ‌ర‌గ‌నున్న నాలుగో టెస్టు మ్యాచ్‌కు క‌రోనా కేసుల కార‌ణంగా ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించ‌డం లేద‌ని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ సీఈవో దీపక్‌ శర్మ వెల్ల‌డించారు.

దీంతో విరాట్ కోహ్లీ అభిమానుల‌తోపాటు క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశ‌కు లోన‌వుతున్నారు. దీంతో ప్ర‌తిష్టాత్మ‌క విరాట్ కోహ్లీ వందో టెస్టు మ్యాచ్ ప్రేక్ష‌కులు లేకుండానే జ‌ర‌గ‌నుంది. మ‌రోవైపు ఈ మ్యాచ్ కోసం విరాట్ కోహ్లీ శ‌నివారం మొహాలీ చేరుకున్నాడు.

కాగా భార‌త్‌, శ్రీ‌లంక మ‌ధ్య మార్చి 4వ తేదీ నుంచి రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జ‌ర‌గ‌నుంది. 4 నుంచి 8 వ‌ర‌కు మొహాలీ వేదిక‌గా తొలి టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా మార్చి 12 నుంచి 16వ తేదీ వ‌ర‌కు రెండో టెస్టు మ్యాచ్ జ‌రగ‌నుంది. ఈ మ్యాచ్ డే అండ్ నైట్ టెస్టుగా జ‌ర‌గ‌నుండ‌డం గ‌మ‌నార్హం.

శ్రీలంక సిరీస్ కోసం భారత టెస్టు జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్‌), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పంచల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్య‌ర్, హనుమ విహారి, శుభ్‌మాన్‌ గిల్, రిషబ్ పంత్, కెఎస్ భరత్, ర‌విచంద్ర‌న్ అశ్విన్, ర‌వీంద్ర‌ జడేజా, జయంత్ యాదవ్, కుల్దీప్ యాద‌వ్‌, జస్ప్రీత్ బుమ్రా (వికెట్ కీప‌ర్‌), మ‌హ్మ‌ద్‌ షమీ, మ‌హ్మ‌ద్‌ సిరాజ్, ఉమేష్ యాదవ్, సౌరభ్ కుమార్.

శ్రీ‌లంక జ‌ట్టు
దిముత్ కరుణరత్నే (కెప్టెన్), పాతుమ్ నిస్సంక, లాహిరు తిరిమన్నె, ధనంజయ డి సిల్వా (వైస్ కెప్టెన్),
కుశాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, దినేష్ చండిమాల్, చరిత్ అసలంక, నిరోషన్ డిక్వెల్లా, చమిక కరుణరత్నే, లహిరు కుమార, సురంగ లక్మల్, దుష్మంత చమీర, విశ్వ ఫెర్నాండో, జెఫ్రీ వాండర్సే,
ప్రవీణ్ జయవిక్రమ, లసిత్ ఎంబుల్దేనియా.

Story first published: Saturday, February 26, 2022, 17:43 [IST]
Other articles published on Feb 26, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+