పల్లెకెలె: విదేశాల్లో అత్యధిక టెస్టు విజయాలను సాధించిన రెండో భారత క్రికెట్ కెప్టెన్‌గా విరాట్‌కోహ్లి చరిత్ర సృష్టించాడు. శ్రీలంకపై విజయంతో భారత కెప్టెన్‌గా కోహ్లికి ఏడో టెస్ట్ విజయం విదేశీ గడ్డపై దక్కింది.దీంతో ఆయన మహేంద్రసింగ్ ధోనిపై ఉన్న రికార్డును అధిగమించినట్టైంది.
గతంలో ధోని ఆరు విదేశీ టెస్ట్ విజయాల్ని సాధించారు. ఆ రికార్డును కోహ్లి చెరిపేశారు. విదేశాల్లో అత్యధిక టెస్ట్ విజయాలను సాధించిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా గంగూలీ పేరిట ఉంది. గంగూలీ పేరిట 11 విదేశీ టెస్టు విజయాల్ని సాధించిన రికార్డు ఉంది. బారత జట్టు కెప్టెన్‌గా గంగూలీ 49 టెస్టులకు సారధ్యం వహించాడు.

ధోని 60 టెస్టులకు కెప్టెన్‌గా బాధ్యతలను నిర్వర్తించాడు.కోహ్లి ఇప్పటికి 29 టెస్టులకు సారధిగా చేశారు. శ్రీలంకో మూడో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 171 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు అంతకంటే ఎక్కువ టెస్టుల సిరీస్‌ను గెలిచిన భారత జట్టుగా విరాట్ సేన నిలిచింది.