టీ20ల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు: రెండో టీ20లో విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు

హైదరాబాద్: కొత్త ఏడాదిని టీమిండియా విజయంతో ఆరంభించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఇలా అన్ని రంగాల్లో కోహ్లీసేన అద్భుత ప్రదర్శన చేసింది. ఫలితంగా మూడు టీ20ల సిరిస్‌లో బోణీ చేసింది. ఇండోర్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు అందుకున్న కెప్టెన్‌గా అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంక పేసర్ లిసత్ మలింగ బౌలింగ్‌లో సింగిల్ తీయడం ద్వారా విరాట్ కోహ్లీ ఈ మైలురాయిని చేరుకున్నాడు.

మూడు టీ20ల సిరిస్ ప్రారంభానికి ముందు
శ్రీలంకతో మూడు టీ20ల సిరిస్ ప్రారంభానికి ముందు ఈ మైలురాయిని చేరుకోవడానికి విరాట్ కోహ్లీ 25 పరుగులు దూరంలో ఉన్నాడు. అయితే, రెండో టీ20లో కోహ్లీ 17 బంతుల్లో 2 సిక్స్‌లు, ఒక ఫోర్ సాయంతో అజేయంగా 30 పరుగులు చేశాడు. కాగా, ఈ జాబితాలో ధోని 62 మ్యాచ్‌ల్లో 1112 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.
భారత్ తరుపున ఈ ఘనత సాధించిన
ఫలితంగా భారత్ తరుపున ఈ ఘనత సాధించిన రెండో కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు. అంతేకాదు కోహ్లీ కేవలం 30 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు. దీంతో పాటు టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన అటగాడిగా తన సహచర ఆటగాడు రోహిత్ శర్మను కూడా కోహ్లీ అధిగమించాడు. ఈ మ్యాచ్‌కి కోహ్లీ పరుగు దూరంలో నిలిచాడు.
ఒక పరుగు చేయడంతో ప్రపంచ రికార్డు
రెండో టీ20లో కోహ్లీ ఒక పరుగు చేసిన వెంటనే టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మను అధిగమించాడు. ఈ మ్యాచ్‌కి ముందు టీ20ల్లో రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లీ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 104 టీ20ల్లో 2,633 పరుగులు సాధించగా... విరాట్ కోహ్లీ 75 మ్యాచుల్లోనే ఈ పరుగులు చేయడం విశేషం.

రోహిత్ శర్మకు విశ్రాంతి
శ్రీలంకతో ప్రారంభమయ్యే మూడు టీ20ల సిరిస్ నుంచి సెలక్టర్లు రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మను దాటే అవకాశం విరాట్ కోహ్లీకి లభించింది. గువహటి వేదికగా ఆదివారం శ్రీలంకతో జరిగే తొలి టీ20 వర్షం కారణంగా రద్దైంది. దీంతో రెండో టీ20లో కోహ్లీ ఈ రికార్డు అందుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications