India vs Sri Lanka: మొహాలీ చేరుకున్న విరాట్ కోహ్లీ.. వందో టెస్టులో సెంచరీ కొట్టాలని..

మొహాలీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్ ద్వారా టెస్ట్ క్రికెట్‌లో మైల్‌స్టోన్ రికార్డును అందుకోనున్నాడు. మార్చి 4 నుంచి మొహాలీ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో విరాట్ కోహ్లీ ఈ ఫార్మాట్‌లో 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకోనున్నాడు. దీంతో ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులతోపాటు కోహ్లీ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

మొహాలీ చేరుకున్న కోహ్లీ
కెరీర్‌లో ఇప్పటివరకు 99 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ శ్రీలంకతో మొహాలీ వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టు మ్యాచ్ ద్వారా కెరీర్‌లో 100 టెస్టు మ్యాచ్‌లు పూర్తి చేసుకోనున్నాడు. తద్వారా టెస్టు క్రికెట్‌లో 100 టెస్టులు ఆడిన భారత ఆటగాడిగా నిలవనున్నాడు. ఈ టెస్టు మ్యాచ్ మార్చి 4వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం విరాట్ కోహ్లీ నేడు మొహాలీకి చేరుకున్నాడు. దాదాపు వారం రోజులు ముందుగానే కోహ్లీ మొహాలీ చేరుకోవడం గమనార్హం. మరోవైపు బీసీసీఐ కూడా కోహ్లీ వందో టెస్టు మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

ప్రేక్షకులకు నో పర్మిషన్
కోహ్లీ వందో టెస్టు మ్యాచ్ కోసం ఆతురతగా ఎదురుచూస్తున్న అభిమానులకు బీసీసీఐ నిరాశజనక వార్త చెప్పింది. శ్రీలంకతో జరగనున్న తొలి టెస్టు మ్యాచ్‌కు కరోనా కారణంగా ప్రేక్షకులను అనుమతించడం లేదని ప్రకటించింది. ఈ మేరకు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ సీఈఓ దీపక్ శర్మ వెల్లడించాడు. దీంతో విరాట్ కోహ్లీ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

కోహ్లీ ఆ లోటు తీర్చేనా
టెస్టు క్రికెట్‌లో ఇప్పటివరకు అనేక మంది భారత ఆటగాళ్లు 100 టెస్టులు ఆడారు. కానీ ఒక్కరు కూడా తమ వందో టెస్టు మ్యాచ్‌లో సెంచరీ కొట్టలేకపోయారు. దీంతో ఇప్పటివరకు టీమిండియా ఆటగాళ్లకు వందో టెస్టు మ్యాచ్‌లో సెంచరీ తీరని లోటుగానే మారిపోయింది. దీంతో ఆ లోటును విరాట్ కోహ్లీ తీర్చాలని అభిమానులు కోరుకుంటున్నారు. మొహాలీ టెస్టులో కోహ్లీ సెంచరీ చేస్తే ఆ ఫార్మాట్‌లో వందో టెస్టులో సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టిస్తాడు.

చివరగా 2019లో
తన 99 టెస్టు మ్యాచ్‌ల కెరీర్‌లో విరాట్ కోహ్లీ 50.39 సగటుతో 7962 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు ఉన్నాయి. కానీ తన అంతర్జాతీయ కెరీర్‌లో విరాట్ కోహ్లీ తొలిసారి సెంచరీ చేయగ రెండేళ్లు గడిచిపోయింది. చివరగా 2019 నవంబర్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. దీంతో శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో కోహ్లీ సెంచరీ చేయాలని అంతా ఆశిస్తున్నారు.

టీమిండియా టెస్టు జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పాంచల్, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, జయంత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, సౌరభ్ కుమార్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications