కోహ్లీ రికార్డులు: ఏడోసారి 150, పదోసారి సెంచరీ: ప్రశంసల వెల్లువ

నాగపూర్: శ్రీలంకతో రెండో టెస్ట్ మ్యాచ్ మూడో రోజూ భారత జట్టు సారథి విరాట్ కోహ్లి సునాయాసంగా పరుగులు చేశాడు. టెస్టు కెరీర్‌లో ఏడోసారి 150కి పైగా పరుగులు సాధించాడు.
దిల్రువాన్ వేసిన 140వ ఓవర్ రెండో బంతిని సిక్సర్‌గా మలచడంతో విరాట్ 150 పరుగుల మార్క్ దాటాడు. అజింక్యా రహానె ఔటైన తర్వాత వచ్చిన రోహిత్ కూడా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.
టీ విరామ సమయానికి 157 ఓవర్లు ఆడిన భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 507 పరుగులు చేసింది. దీంతో భారత్ 302 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. కోహ్లి (170), రోహిత్ శర్మ(51) క్రీజులో ఉన్నారు.
కాగా, ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డును కోహ్లీ సొంతం చేసుకున్నాడు. పాంటింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. పాంటింగ్ ఒక కేలండర్ ఇయర్లో 9 సెంచరీలు చేస్తే, కోహ్లీ ఆదివారం నాటి సెంచరీతో పది చేశాడు.
కోహ్లీ సెంచరీ నేపథ్యంలో అభిమానుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications