
హైదరాబాద్: శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో భారత ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 300 వికెట్ల మైలురాయిని అందుకున్న బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. నాగ్‌పూర్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో చివరి బ్యాట్స్‌మన్ గమాగె (0)ను క్లీన్‌బౌల్డ్ చేసి అశ్విన్ ఈ రికార్డు నెలకొల్పాడు.
ఈ టెస్టు మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు 8 వికెట్ల దూరంలో ఉన్న అశ్విన్... తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి ఈ రికార్డును సృష్టించాడు. గతంలో ఈ రికార్డు అస్ట్రేలియా పేస్ దిగ్గజం డెన్నిస్ లిల్లీ పేరిట ఉంది. డెన్నిస్ ఈ ఘనతను 56 మ్యాచుల్లో సాధించగా.. అశ్విన్ కేవలం 54 మ్యాచ్‌ల్లోనే సాధించడం విశేషం.
కాగా, ఇప్పటివరకు టెస్టుల్లో 26సార్లు 5 వికెట్లు, 7సార్లు పది వికెట్లు తీసుకున్నాడు. అత్యంత వేగంగా టెస్టుల్లో 300 వికెట్లు తీసిన అశ్విన్‌పై బీసీసీఐ సహా పలువురు క్రికెటర్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.
టెస్టుల్లో అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్లు వీరే:
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.