
హైదరాబాద్: ఫిరోజ్ షా కోట్లా వేదికగా భారత్‌తో జరుగుతున్న చివరి టెస్టులో శ్రీలంక క్రికెటర్లు ముఖాలకు మాస్క్‌లు ధరించి ఫీల్డింగ్ చేయడంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు సైతం శ్రీలంక తీరును తప్పబడుతున్నారు.
శ్రీలంక ఆటగాళ్ల ప్రవర్తన అంతర్జాతీయ ఆటగాళ్ల ప్రవర్తన మాదిరి లేదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. 'ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మాస్క్‌లు ధరించిన ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మాత్రం ఎందుకు ధరించలేదో' అని సౌరవ్ గంగూలీ సోమవారం మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించాడు.
చివరి టెస్టు, రెండో రోజు ఆటలో భాగంగా శ్రీలంకకు చెందిన ఆటగాళ్లు ముఖానికి మాస్కులు ధరించి అడిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం నుంచే పొగ మైదానాన్ని కమ్మేయగా.. మధ్యాహ్నానికి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. దీంతో శ్రీలంకకు చెందిన ఆటగాళ్లు ముఖాలకు మాస్కులు ధరించి ఆడారు.
ఈ సమయంలో విరాట్ కోహ్లీ 240 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. లంచ్ విరామం తర్వాత మధ్యాహ్నం 12.32 ప్రాంతంలో లంక పేస్ బౌలర్ గమాగె దగ్గుతో.. బౌలింగ్ ఆపేశాడు. ఆ సమయంలో అశ్విన్ కూడా కాస్త ఇబ్బంది పడ్డాడు. మిగతా ఆటగాళ్లు కూడా అసౌకర్యంగా కనిపించడంతో ఆట నిలిచిపోయింది.
గాలిలో తగినంత నాణ్యత కరవైందని శ్రీలంక ఆటగాళ్లు అంపైర్లను సంప్రదించారు. ఆటను నిలిపివేయాలని కోరారు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఇలాంటి పరిస్థితుల్లో ఆట ఆపడం సాధ్యం కాదని లంక జట్టుకు అంపైర్లు తేల్చి చెప్పారు. ఆ తర్వాత చివరికి 17 నిమిషాల తర్వాత మళ్లీ ఆట మొదలైంది. లంక జట్టు మాత్రం ఆట కొనసాగించడానికి అయిష్టంగానే కనిపించింది.
ఈ క్రమంలో శ్రీలంక ఆటగాళ్లు మాస్క్‌లు ధరించి ఫీల్డింగ్‌కు దిగారు. 25 నిమిషాల తర్వాత మళ్లీ ఆ జట్టు మళ్లీ సేమ్ సీన్ రిపీట్ చేసింది. దీంతో రెండోసారి ఆట ప్రారంభమైన తర్వాత కూడా లంక ఆటగాళ్లు మళ్లీ ఆటకు అడ్డుపడ్డారు. దీంతో ఏకాగత్ర కోల్పోయిన విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. మళ్లీ అలాగే చేస్తుండటంతో డిక్లేర్ చేశాడు.
అయితే మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు, కోహ్లీ, అశ్విన్, జడేజా, సాహా ఎవరూ మాస్క్‌లు ధరించలేదు. శ్రీలంక ఆటగాళ్లు కావాలనే ఇలా చేశారని అనిపించడంతో సోషల్ మీడియాలో వారిపై నెటిజన్లు జోకులు వేస్తున్నారు. శ్రీలంక ఆటగాళ్లపై నెటిజన్లు చేసిన ట్వీట్లు ఇవే...
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.