Kohli 100th Test: కొట్టు కోహ్లీ కొట్టు.. రికార్డులు బద్దలవ్వాలే! వందో టెస్టుపై అభిమానుల డిమాండ్స్

మొహాలీ: శ్రీలంకతో నేటి నుంచి జరగనున్న తొలి టెస్ట్ మ్యాచ్‌తో టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ వంద టెస్టు మ్యాచ్‌ల మైలు రాయిని చేరుకోబోతున్నాడు. దీంతో క్రికెట్ ప్రపంచం మొత్తం ఇప్పుడు విరాట్ కోహ్లీ వైపే చూస్తోంది. 2011లో టెస్టు కెరీర్ ప్రారంభించిన కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్‌లో అంచెలంచెలుగా ఎదిగాడు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. కెప్టెన్‌గానూ రికార్డు విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. 12 ఏళ్ల టెస్టు కెరీర్‌లో 99 టెస్టు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. దీంతో నేటి నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేకమైన తన వందో టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.

12వ ఆటగాడిగా..
సుదీర్ఘ ఫార్మాట్‌లో వందో టెస్టు మ్యాచ్ ఆడబోతున్న 12వ భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలవబోతున్నాడు. కోహ్లీ కంటే ముందు ఇప్పటివరకు 11 మంది భారత ఆటగాళ్లు 100 టెస్టు మ్యాచ్‌ల మైలురాయిని చేరుకున్నారు. వారిలో సచిన్ టెండూల్కర్ (200), రాహుల్ ద్రావిడ్ (163), వీవీఎస్ లక్ష్మణ్ (134), అనిల్ కుంబ్లే (132), కపిల్ దేవ్ (131), సునీల్ గవాస్కర్ (125), వెంగ్ సర్కార్ (116), గంగూలీ (113), ఇషాంత్ శర్మ (105), హర్బజన్ సింగ్ (103), వీరేంద్రసెహ్వాగ్ (105) ఉన్నారు. కాగా అంతర్జాతీయంగా వంద టెస్టు మ్యాచ్‌లు పూర్తి చేసుకోబోతున్న 71వ ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలవబోతున్నాడు.

వందలో సెంచరీ కొట్టాలని..
సుదీర్ఘ ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టి రెండేళ్లు దాటిపోయింది. పలు మార్లు హాఫ్ సెంచరీలు చేసిన వాటిని సెంచరీలుగా మలచలేకపోయాడు. దీంతో వందో టెస్టు మ్యాచ్‌లో సెంచరీ కొట్టి తన పాత విరాట్ కోహ్లీని బయటకి తేవాలని డిమాండ్లు చేస్తున్నారు. తద్వారా రికార్డులు బద్దలు కొట్టాలని రాసుకొస్తున్నారు. సోషల్ మీడియాలో కొట్టు కోహ్లీ కొట్టు వందో టెస్టు మ్యాచ్‌లో సెంచరీ కొట్టు అని రాసుకొస్తున్నారు. దీంతో వందో టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఎన్ని పరుగులు చేయబోతున్నాడనే దాని కోసం ఇప్పుడు అంతటా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రికార్డులకు చేరువలో
విరాట్ కోహ్లీ వందో టెస్టు మ్యాచ్‌లో సెంచరీ కొడితో సుదీర్ఘ ఫార్మాట్‌లో వందో టెస్టులో సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టిస్తాడు. అలాగే మరో సెంచరీ సాధిస్తే అంతర్జాతీ క్రికెట్‌లో కోహ్లీ 71వ సెంచరీని చేరుకుంటాడు. తద్వారా క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్‌తో కలిసి రెండో స్థానంలో నిలుస్తాడు. అలాగే మరో 38 పరుగులు సాధిస్తే టెస్టు క్రికెట్‌లో కోహ్లీ 8 వేల పరుగుల మైలు రాయిని చేరుకుంటాడు. తొలి ఇన్నింగ్స్‌లో 38 పరుగులు చేస్తే వేగంగా 8 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆరో భారత ఆటగాడిగా కోహ్లీ నిలుస్తాడు.

కోహ్లీ టెస్టు కెరీర్
తన కెరీర్లో ఇప్పటివరకు 99 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 50 సగటుతో 7962 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 7 సార్లు డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అత్యధిక స్కోర్ 254 పరుగులు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications