Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: శ్రీలంకకు మరో షాక్.. స్టార్ ప్లేయర్ దూరం

భారత్‌తో సిరీస్ ప్రారంభం కాకముందే శ్రీలంకకు వరుసగా షాక్‌లు ఎదురవుతున్నాయి. అనారోగ్యం కారణంగా ఇప్పటికే దుష్మాంత చమీర జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా ఫాస్ట్ బౌలర్ నువాన్ తుషార కూడా జట్టు నుంచి వైదొలిగాడు. ఫీల్డింగ్ ప్రాక్టీస్‌లో బుధవారం అతని ఎడమ చేతి వేలు విరిగింది. దీంతో జులై 27 నుంచి ప్రారంభంకానున్నటీ20 సిరీస్‌కు అతను దూరమయ్యాడు.

నువాన్ తుషారా స్థానంలో దిల్షాన్ మధుశంక జట్టులోకి వచ్చాడు. తుషారా గత కొంతకాలంగా శ్రీలంక టీ20 తుదిజట్టులో కొనసాగుతున్నాడు. లంక విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో లంక ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది హ్యాట్రిక్ కూడా సాధించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్‌తో సహా అయిదు వికెట్లు తీశాడు.

India vs Sri Lanka Thushara Ruled Out of India T20Is Due to Broken Finger

కాగా, మరో పేసర్ చమీర స్థానంలో అసిత ఫెర్మాండో లంక జట్టుతో చేరాడు. భారత్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు శ్రీలంక తమ జట్టును శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. లంక జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చాడు. వానిందు హసరంగా సారథి బాధ్యతల నుంచి తప్పుకోవడంతో చరిత్ అసలంక జట్టు పగ్గాలు అందుకున్నాడు.

టీ20 వరల్డ్ కప్-2024లో శ్రీలంక గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో ఓటమికి బాధ్యత వహిస్తూ హసరంగా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో ఎడమచేతి వాటం బ్యాటర్ చరిత్ అసలంకను నియమించారు. అసలంక మూడు టెస్టులు, 59 వన్డేలు, 47 టీ20లు ఆడాడు. పొట్టి ఫార్మాట్‌లో 1061 పరుగులు చేశాడు.

శ్రీలంక టీ20 జట్టు: చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, దినేష్ చండిమాల్, కామిందు మెండిస్, దసున్ షనక, వానిందు హసరంగా, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, చమిందు విక్రమసింఘే, మతీషా పతిరనా, దిల్షాన్ మధుశంక, అసిత ఫెర్మాండో, బినూర ఫెర్నాండో.

Story first published: Thursday, July 25, 2024, 14:10 [IST]
Other articles published on Jul 25, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+