Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: కొంపముంచిన అర్షదీప్.. తొలి వన్డే ‘టై’

కొలంబో వేదికగా శుక్రవారం ఉత్కంఠ భరితంగా సాగిన భారత్- శ్రీలంక తొలి వన్డే టైగా మారింది. శివమ్ దూబె (25; 24 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు) క్రీజులో ఉన్నంతసేపు భారత్ విజయం సాధిస్తుందని ధీమాగా ఉంది. కానీ ఒక్కసారి చివరి రెండు వికెట్లు వరుసగా కోల్పోవడంతో మ్యాచ్ టైగా ముగిసింది.

మందకొడి పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఎనిమిది వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ధునిత్ వెల్లలాగే (66 నాటౌట్; 65 బంతుల్లో, 7 ఫోర్లు, 2 సిక్సర్లు), నిస్సాంక (56; 75 బంతుల్లో, 9 ఫోర్లు) అర్ధశతకాలతో సత్తాచాటారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ (2/33), అర్షదీప్ సింగ్ (2/47) తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనకు దిగిన భారత్‌ 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది.

tie

అనంతరం ఛేదనకు దిగిన భారత్‌ 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ శర్మ (58; 47 బంతుల్లో, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. అక్షర్ పటేల్ (33; 57 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్), కేఎల్ రాహుల్ (31; 43 బంతుల్లో, 2 ఫోర్లు), విరాట్ కోహ్లి (24; 32 బంతుల్లో, 2 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (23; 23 బంతుల్లో, 4 ఫోర్లు) పరుగులు చేశారు. లంక బౌలర్లలో హసరంగ (3/58), అసలంక (3/30) చెరో మూడు, వెల్లలాగే రెండు వికెట్లతో సత్తాచాటారు.

ఛేదనలో భారత్‌‌కు శుభారంభం దక్కింది. పిచ్ స్వభావంతో సంబంధం లేకుండా హిట్ మ్యాన్ చెలరేగడంతో వపర్‌ప్లేలో ఇండియా 71 పరుగులు చేసింది. ఈ క్రమంలో రోహిత్ 33 బంతుల్లోనే అర్ధశతకం బాదాడు. అయితే 13వ ఓవర్‌లో మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (16; 35 బంతుల్లో, 2 ఫోర్లు) ఔటవ్వడంతో భారత్ వికెట్ల పతనం మొదలైంది. కాసేపటికే రోహిత్, సుందర్ (5; 4 బంతుల్లో, 1 ఫోర్) వరుసగా పెవిలియన్‌కు చేరడంతో 75/0 నుంచి భారత్ 87/3కు చేరింది.

ఆ తర్వాత కోహ్లి-శ్రేయస్, కేఎల్ రాహుల్- అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడానికి ప్రయత్నించారు. కానీ లంక బౌలర్లు కీలక సమయంలో పుంజుకుని భాగస్వామ్యాలకు తెరదించారు. అయితే దూబె క్రీజులో ఉంటంతో భారత్‌ శిబిరంలో విజయంపై ధీమాగా ఉంది. ఆఖర్లో సిక్సర్, ఫోర్‌తో స్కోరును సమం చేశాడు. అయితే అసలంక దూబెను వికెట్లు ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇంకా 14 బంతులు మిగిలుఉండటంతో ఆఖరిగా బ్యాటింగ్ వచ్చిన అర్షదీప్ సింగిల్‌ను సులువుగా తీసి జట్టుకు విజయాన్ని అందిస్తాడని భావించారంతా. కానీ అర్షదీప్ భారీ షాట్‌కు యత్నించి తొలి బంతికే ఔటయ్యాడు. దీంతో భారత్ గెలిచే అవకాశాన్ని కోల్పోయింది.

Story first published: Friday, August 2, 2024, 22:05 [IST]
Other articles published on Aug 2, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+