Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: అందుకే పంత్‌ను తీసుకోలేదు- రోహిత్ శర్మ

శ్రీలంక పర్యటనలో టీ20 వరల్డ్ కప్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత్ మరో సిరీస్‌కు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కొలంబో వేదికగా ఇవాళ తొలి మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టీ20 వరల్డ్ కప్ విజయానంతరం విశ్రాంతి తీసుకున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇవాళ రీఎంట్రీ ఇస్తున్నారు.

మరోవైపు కోచ్ గంభీర్- కెప్టెన్ రోహిత్ కాంబినేషనల్‌లో ఇదే మొదటి మ్యాచ్ కానుండటంతో ఈ మ్యాచ్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. అంతేగాక వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్ అనంతరం కోహ్లి, రోహిత్‌కు ఇదే తొలి వన్డే. కాగా, వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో పెట్టుకుని ఇవాళ మ్యాచ్‌లో టీమిండియా జట్టుకూర్పును సిద్ధం చేశారు.

India vs Sri Lanka There Have Been a Lot of Changes in Team India - Rohit Sharma

ఈ క్రమంలో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి వచ్చారని టాస్ సందర్భంగా రోహిత్ శర్మ పేర్కొన్నాడు. దీంతో పంత్, రాహుల్‌లలో ఎవరిని ఎంచుకుంటారనే ఉత్కంఠకు తెరపడింది. తొలుత బౌలింగ్ చేయడం ఫర్వాలేదని, మ్యాచ్ కొనసాగే కొద్ది స్లోగా మారుతుందని రోహిత్ అన్నాడు. ''పిచ్ బాగుంది. ఇక్కడి పరిస్థితులపై అవగాహన ఉంది. జట్టులో చాలా మార్పులు ఉన్నాయి. నేను, విరాట్, రాహుల్, శ్రేయస్ అయ్యర్ తిరిగొచ్చాం. కుల్‌దీప్, దూబె కూడా ఉన్నారు'' అని రోహిత్ తెలిపాడు.

ఇక తన బ్యాటింగ్‌పై దృష్టి సారిస్తాని రోహిత్ అన్నాడు. మరోవైపు శ్రీలంక కెప్టెన్ అసలంక మాట్లాడుతూ.. ''పిచ్ పొడిగా ఉందని తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాం. ఇవాళ షిరాజ్ అరంగేట్రం చేయనున్నాడు. గత మ్యాచ్‌లో ఎదురైన పరాభవాలను మరిచి ముందుకు సాగాలని భావిస్తున్నాం'' అని తెలిపాడు.

తుది జట్ల వివరాలు
భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, శివమ్ దూబె, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్

శ్రీలంక: పతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, సమరవిక్రమ, చరిత అసలంక, జనిత్ లియంగే, హసరంగ, దునిత్ వెల్లలాగె, అఖిల ధనంజయ, అసిత ఫెర్నాండో, మహ్మద్ షిరాజ్.

Story first published: Friday, August 2, 2024, 14:21 [IST]
Other articles published on Aug 2, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+