
ఇండియాదే అధిపత్యం
ఇండియా, శ్రీలంక మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌ల్లో ఇండియాదే పూర్తి అధిపత్యం ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు 44 టెస్టు మ్యాచ్‌ల్లో తలపడగా భారత్ అత్యధికంగా 20 మ్యాచ్‌ల్లో గెలిచింది. శ్రీలంక 7 టెస్టు మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇక 17 టెస్ట్ మ్యాచ్‌లు ఫలితం తేలకుండానే డ్రాగా ముగిశాయి. స్వదేశంలో భారత్ 11 టెస్టు మ్యాచ్‌లు గెలవగా శ్రీలంకలో 9 గెలిచింది. ఇక శ్రీలంక విషయానికొస్తే స్వదేశంలో 7 టెస్ట్ మ్యాచ్‌లు గెలిచిన ఆ జట్టు ఇప్పటివరకు భారత్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. శ్రీలంకలో కూడా ఆ జట్టు కంటే టీమిండియానే ఎక్కువ టెస్టు మ్యాచ్‌లు గెలవడం విశేషం. శ్రీలంకలో ఆ జట్టు 7 గెలవగా.. భారత్ 9 గెలిచింది.

సిరిస్‌ల్లోనూ ఇండియాదే జోరు
భారత్, శ్రీలంక మధ్య ఇప్పటివరకు 17 టెస్ట్ సిరీస్‌లు జరగగా ఇండియా అత్యధికంగా 9 సిరీస్‌లు గెలిచింది. శ్రీలంక 3 సిరీస్‌లు మాత్రమే గెలిచింది. 4 టెస్టు సిరీస్‌లు డ్రాగా ముగిశాయి. 1998- 1999లో ఆసియా టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా టెస్ట్ సిరీస్‌లో ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక తలపడ్డాయి. ఆ ఛాంపియన్‌షిప్‌ను పాకిస్థాన్ గెలుచుకుంది. ఇప్పటివరకు భారత్‌లో శ్రీలంక ఒక సారి కూడా టెస్ట్ సిరీస్ గెలవలేకపోయింది. రెండు సార్లు మాత్రం టెస్ట్ సిరీస్‌ను డ్రా చేసుకుంది.

టెస్ట్ సిరీస్ షెడ్యూల్
భారత్, శ్రీలంక మధ్య ఈ నెల 4 నుంచి 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. మొహాలీ వేదికగా ఈ నెల 4 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ 4 నుంచి 8 వరకు జరగనుంది. రెండో టెస్ట్ మ్యాచ్ 12 నుంచి 16వ తేదీ వరకు బెంగళూరు వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌గా జరగనుంది. ఇక తొలి టెస్ట్ మ్యాచ్‌తో టీమిండియా వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 100 టెస్ట్ మ్యాచ్‌ల మైలురాయిని అందుకోబోతున్నాడు.

శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), ప్రియాంక్ పాంచల్, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హనుమ విహరి, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్(కీపర్), కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, సౌరభ్ కుమార్, మహమ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్


Click it and Unblock the Notifications












