నెట్ ప్రాక్టీస్: అవకాశం కోసం ఎదురు చూస్తున్న రహానే (ఫోటోలు)
హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా భారత్, శ్రీలంక జట్ల మధ్య ఆగస్టు 3 (గురువారం)న రెండో టెస్టు ప్రారంభం కానుంది. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో కోహ్లీసేన 304 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరిస్‌లో 1-0తో ముందంజలో ఉంది.
రెండో టెస్టు కోసం కోహ్లీసేన సోమవారం కొలంబో చేరుకుంది. మంగళవారం ఉదయమే ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది. రెండో టెస్టులో కూడా విజయం సాధించి సిరిస్‌ను కైవసం చేసుకోవాలని రవిశాస్త్రి నేతృత్వంలో కోహ్లీసేన సింహలీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది.
ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా ధావన్, అభినవ్ ముకుంద్‌లు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ ప్రాక్టీస్ సెషన్‌లో కెప్టెన్ కోహ్లీతో పాటు జట్టులోని మిగతా ఆటగాళ్లు కూడా పాల్గొన్నారు. టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో పాల్గొన్న ఫొటోలను బీసీసీఐ ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది.
మరోవైపు శ్రీలంక ఆటగాళ్లు కూడా కొలంబో టెస్టుని కాస్తంత సీరియస్‌గానే తీసుకున్నారు. అయితే లంక జట్టును గాయాల బెడద బాధిస్తోంది. దీంతో కొలంబో టెస్టుకి లంక జట్టులో కీలక మార్పులు చేసే అవకాశం ఉంది. అనారోగ్యంతో తొలి టెస్టుకు దూరమైన కెప్టెన్ చండీమాల్ రెండో టెస్టుకు అందుబాటులో వచ్చాడు.
కెప్టెన్ విరాట్ కోహ్లీ
కొలంబోలోని సింహలీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో నెట్ ప్రాక్టీస్ చేసేందుకు కిట్‌తో వస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.
భువీకి ఉమేశ్ యాదవ్ సాయం
కొలంబోలోని సింహలీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో నెట్ ప్రాక్టీస్ ఎక్సర్ సైజ్ చేస్తున్న బౌలర్లు భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్.
జడేజా, అశ్విన్
రెండో టెస్టు కోసం కొలంబోలోని సింహలీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో ప్రాక్టీస్‌కు వస్తున్న టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శిఖర్ ధావన్, అభినవ్ ముకుంద్.
ప్రాక్టీస్ కోసం ఎదురు చూస్తున్న రహానే
కోహ్లీ సేన ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఆధ్వర్యంలో మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది. నెట్ సెషన్‌లో పాల్గొన్న రహానె అవకాశం కోసం ఎదురుచూస్తున్న రహానే.
జిమ్‌లో శిఖర్ ధావన్
కొలంబోలోని సింహలీస్ స్పోర్ట్స్ క్లబ్‌లోని జిమ్‌లో కసరత్తులు చేస్తున్న ఓపెనర్ శిఖర్ ధావన్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications