Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Sri Lanka: భార‌త‌ ఆట‌గాళ్లు క‌ఠోర ప్రాక్టీస్‌.. లంకేయుల‌కు ఇక చుక్క‌లే!

India vs Sri Lanka: Team India players practiced for the T20 series

ల‌క్నో: శ్రీ‌లంక‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా సిద్ధ‌మ‌వుతుంది. ఈ నెల 24 నుంచి మొద‌ల‌వ‌నున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం టీమిండియా నేడు ప్రాక్టీస్ ప్రారంభించింది. ఆట‌గాళ్లంతా ప్రాక్టీస్‌లో క‌ఠోరంగా శ్ర‌మించారు. తొలి టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నున్న ల‌క్నోకు భార‌త జ‌ట్టు సోమ‌వార‌మే చేరుకుంది. దీంతో మంగ‌ళ‌వారం ఆట‌గాళ్లు మైదానంలో ప్రాక్టీస్ మొద‌లు పెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోల‌ను బీసీసీఐ త‌న అధికారిక‌ ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది.

ఆట‌గాళ్లు ప్రాక్టీస్‌

నేడు ల‌క్నో వేదిక‌గా భార‌త టీ20 జ‌ట్టు ఆట‌గాళ్లు సీరియ‌స్‌గా ప్రాక్టీస్ చేశారు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌తో స‌హా ఆట‌గాళ్లంతా ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. ఈ క్ర‌మంలో హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆట‌గాళ్ల‌కు విలువైన సూచ‌న‌లు ఇచ్చాడు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, ఓపెన‌ర్ ఇషాన కిష‌న్, ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా, శ్రేయ‌స్ అయ్య‌ర్, రుతురాజ్ గైక్వాడ్, సూర్య‌కుమార్ యాద‌వ్ త‌దిత‌రులు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ఇక మ‌హ్మ‌ద్ సిరాజ్‌, జ‌స్ప్రీత్ బుమ్రా, భువ‌నేశ్వ‌ర్ కుమార్, ర‌వి బిష్ణోయ్‌, చాహ‌ల్ త‌దిత‌రులు బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. బ్యాటింగ్, బౌలింగే కాకుండా ఆట‌గాళ్లంతా ఫీల్డింగ్‌లో కూడా మెళ‌కువ‌ల‌ను ప్రాక్టీస్ చేశారు. అలాగే ప్రాక్టీస్‌కు ముందు వ్యాయామం వంటివి కూడా చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను బీసీసీఐ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేయ‌గా ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

జ‌ట్టు ఎంపిక

కాగా శ్రీ‌లంక‌తో టీ20, టెస్ట్ సిరీస్‌ల‌కు సెలెక్ట‌ర్లు ఇప్ప‌టికే వేర్వేరుగా 18 మందితో కూడిన భార‌త జ‌ట్ల‌ను ప్ర‌క‌టించారు. ఈ ప‌ర్య‌ట‌న‌తో రోహిత్ శ‌ర్మ అన్ని ఫార్మాట్ల‌లో టీమిండియాకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. అటు శ్రీ‌లంక క్రికెట్ బోర్డు కూడా భార‌త్‌తో టీ20 సిరీస్‌కు 18 మందితో కూడిన త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఈ జ‌ట్టును దాసున్ షనక లీడ్ చేయ‌నున్నాడు.

భార‌త్ టీ20 జ‌ట్టు

భార‌త్ టీ20 జ‌ట్టు

రోహిత్ శర్మ(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్(కీపర్), వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహర్, దీపక్ హుడా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ఆవేశ్ ఖాన్.

భారత టెస్ట్ జట్టు

భారత టెస్ట్ జట్టు

రోహిత్ శర్మ(కెప్టెన్), ప్రియాంక్ పాంచల్, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హనుమ విహరి, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్(కీపర్), కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, సౌరభ్ కుమార్, మహమ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్).

Rahul Dravid Confident OnT20 World Cup 2022 Team Combination | Oneindia Telugu
శ్రీ‌లంక టీ20 జ‌ట్టు

శ్రీ‌లంక టీ20 జ‌ట్టు

దాసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిస్సంక, కుసాల్ మెండిస్, చరిత్ అసలంక (వైస్-కెప్టెన్), దినేష్ చండిమాల్, దనుష్క గుణతిలక, కమిల్ మిషారా, జనిత్ లియానగే, వానిందు హసరంగా, చామికా కరుణరత్నే, దుష్మంత చమీర, లహిరు కుమార, బినూర ఫెర్నాండో, షిరాన్ ఫెర్నాండో, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, ప్రవీణ్ జయవిక్రమ, ఆషియాన్ డేనియల్.

Story first published: Tuesday, February 22, 2022, 21:46 [IST]
Other articles published on Feb 22, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+