Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Sri Lanka: నెట్స్‌లో శ్ర‌మిస్తున్న విరాట్ కోహ్లీ.. 100వ టెస్టులో సెంచ‌రీ ప‌క్కా అంటున్న నెటిజ‌న్స్‌

India vs Sri Lanka: Team India players practice in nets with Virat Kohli for Test series against Sri Lanka

మొహాలీ: టీ20 సిరీస్ ముగిసింది. ఇక టెస్టు సిరీస్ వంతు వ‌చ్చింది. దీంతో శ్రీ‌లంక‌తో టెస్టు సిరీస్ కోసం టీమిండియా ఆట‌గాళ్లు నేడు ప్రాక్టీస్ మొద‌లు పెట్టారు. సినీయ‌ర్ ఆట‌గాళ్లు విరాట్ కోహ్లీ, ర‌వి చంద్ర‌న్ అశ్విన్‌తో స‌హా ఆట‌గాళ్లంతా ప్రాక్టీస్ సెష‌న్‌లో పాల్గొన్నారు. హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో సాధ‌న చేశారు. దీనికి సంబంధించిన ఫోటోల‌ను బీసీసీఐ త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేయ‌గా నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

శ్ర‌మించిన కోహ్లీ

కొంత కాలంగా స‌రైన ఫామ్‌లో లేక ఇబ్బంది ప‌డుతున్న టీమిండియా వెట‌ర‌న్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ నేడు నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మించాడు. సెంచ‌రీ చేయ‌క రెండేళ్లు ధాటి పోవ‌డంతో ఈ సిరీస్‌లోనైనా సెంచ‌రీ కొట్టాల‌ని అంతా కోరుకుంటున్నారు. దీనికి తోడు మొహాలీ వేదిక‌గా శ్రీ‌లంక‌తో జ‌ర‌గ‌బోయే తొలి టెస్ట్ మ్యాచ్ విరాట్ కోహ్లీ కెరీర్లో వంద‌వ‌ది కావ‌డం విశేషం. దీంతో వందో టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచ‌రీ కొట్టాల‌ని అభిమానులు ఆశిస్తున్నారు. నెటిజ‌న్లు కూడా వందో టెస్టు కోహ్లీ సెంచ‌రీ కొట్ట‌డం ఖాయ‌మ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. అదే జ‌రిగితే రెండున్న‌రేళ్ల విరాట్ కోహ్లీ సెంచ‌రీ నిరీక్ష‌ణ తీర‌డంతోపాటు వందో టెస్టు మ్యాచ్‌లో సెంచ‌రీ కొట్టిన తొలి భార‌త ఆట‌గాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టిస్తాడు. దీనికి తోడు కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్నాక సాధార‌ణ ఆట‌గాడిగా ఆడబోతున్న తొలి టెస్టు మ్యాచ్ ఇదే కానుండ‌డం గ‌మ‌నార్హం.

ఆట‌గాళ్లంతా ప్రాక్టీస్

టీమిండియా వెట‌ర‌న్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్, యువ బౌల‌ర్ మహ్మ‌ద్ సిరాజ్, వైస్ కెప్టెన్ జ‌స్ప్రీత్ బుమ్రా కూడా నెట్స్‌లో శ్ర‌మించారు. అలాగే శుభ్‌మన్ గిల్, హనుమ విహారి, కెఎస్ భరత్, ఉమేష్ యాదవ్, కుల్దీప్ యాదవ్, మయాంక్ అగర్వాల్ స‌హా ఇత‌ర ఆట‌గాళ్లంతా ప్రాక్టీసు సెష‌న్‌లో పాల్గొన్నారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌తోపాటు ఫీల్డింగ్ కూడా ప్రాక్టీస్ చేశారు. వారికి హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అవ‌స‌ర‌మైన మేర విలువైన సూచ‌న‌లు ఇచ్చాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ప్రాక్టీసు సెష‌న్‌లో భారీ షాట్లు ఆడుతూ క‌నిపించాడు.

టెస్టు సిరీస్ షెడ్యూల్‌

టెస్టు సిరీస్ షెడ్యూల్‌

భార‌త్, శ్రీ‌లంక మ‌ధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జ‌ర‌గ‌నుంది. మెహాలీ వేదిక‌గా ఈ నెల 4 నుంచి 8 వ‌ర‌కు తొలి టెస్ట్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇందుకోసం ఇరు జ‌ట్లు ఇప్ప‌టివ‌కే మొహాలీ చేరుకుని ప్రాక్టీస్‌ కూడా ప్రారంభించారు. అయితే క‌రోనా ఆంక్ష‌ల దృష్యా ఈ మ్యాచ్‌కు ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించ‌డం లేదు. ఇక రెండో మ్యాచ్ ఈ నెల 12 నుంచి బెంగ‌ళూరు వేదిక‌గా డే అండ్ నైట్ టెస్ట్‌గా జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు మాత్రం ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించ‌నున్నారు.

భార‌త జ‌ట్టు

భార‌త జ‌ట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీప‌ర్), హనుమ విహారి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ (ఫిట్‌నెస్)/జయంత్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్‌), మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.

Story first published: Tuesday, March 1, 2022, 17:20 [IST]
Other articles published on Mar 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+