Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే హార్దిక్‌‌ను కెప్టెన్‌గా చేయలేదు- చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్

టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు అందుకున్న గౌతమ్ గంభీర్ తొలిసారిగా మీడియా సమావేశానికి హాజరయ్యాడు. గంభీర్‌తో పాటు టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా పాల్గొన్నాడు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. హార్దిక్ పాండ్యను కెప్టెన్‌గా ఎందుకు ఎంపిక చేయలేదనే ప్రశ్నకు వివరణ ఇచ్చారు.

టీ20లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో పొట్టి ఫార్మాట్‌లో టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్య ఎంపికవుతాడని భావించారంతా. కానీ సారథిగా సూర్యకుమార్ యాదవ్‌ను సెలక్టర్లు నియమించారు. శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టుకు సూర్యను కెప్టెన్‌గా సెలక్ట్ చేశారు. అంతేగాక 2026 టీ20 వరల్డ్ కప్ వరకు సూర్యనే కెప్టెన్‌గా ఉంటాడని సమాచారం.

India vs Sri lanka Team India Chief Selector Ajit Agarkar Reveals Why Hardik Pandya Wasn t Appointed Captain

ఈ నేపథ్యంలో ఎంపిక మార్పు గురించి మీడియా సమావేశంలో ప్రశ్నలు వచ్చాయి. దీనికి అజిత్ అగార్కర్ వివరణ ఇచ్చాడు. ఫిట్‌నెస్ దృష్ట్యానే హార్దిక్‌కు సారథి బాధ్యతలు అందివ్వలేదని పేర్కొన్నాడు. అన్ని సమయాల్లో అందుబాటులో ఉండే ప్లేయర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయాలని భావించామని, అందుకే హార్దిక్‌‌కు జట్టు పగ్గాలు ఇవ్వలేదని చెప్పాడు. కానీ హార్దిక్ పాండ్యకు తమకు ఎంతో కీలకమైన ప్లేయర్ అని తెలిపాడు.

అర్హులైన వాళ్లలో సూర్యకుమార్ యాదవ్‌ను ఎంచుకున్నామని అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు. ''హార్దిక్ పాండ్య కీలకమైన ప్లేయర్. ఎంతో నైపుణ్యం ఉన్న ఆటగాడు. కానీ ఫిట్‌నెస్ అనేది చాలా ముఖ్యమైనది. అన్ని సమయాల్లో అందుబాటులో ఉండే ప్లేయర్ కావాలి. అందుకే సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా నియమించాం. అర్హులైన వాళ్లలో అతను ఒక్కరు. టీ20 అత్యుత్తమ బ్యాటర్లలో సూర్య ఒకరు'' అని అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు. కెప్టెన్‌గా సూర్య ఎంపికలో డ్రెస్సింగ్ రూమ్ అభిప్రాయాలను కూడా తీసుకున్నామని చెప్పాడు.

Story first published: Monday, July 22, 2024, 10:28 [IST]
Other articles published on Jul 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+