Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Sri Lanka: మూడు చ‌రిత్రాత్మ‌క మైల్‌స్టోన్స్‌కు చేరువ‌లో రోహిత్ శ‌ర్మ‌.. నేడు రికార్డులు బ‌ద్ద‌లే!

India vs Sri Lanka: Team India captain Rohit Sharma Was approaching of breaking 3 records
IND vs SL 1st T20I: India’s Predicted Playing XI For First T20I | Oneindia Telugu

ల‌క్నో: టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మూడు రికార్డుల‌కు అత్యంత చేరువ‌లో ఉన్నాడు. ఇందులో రెండు రికార్డుల‌ను నేడు శ్రీ‌లంక‌తో జ‌ర‌గ‌నున్న తొలి టీ20 మ్యాచ్‌లోనే అందుకునే అవ‌కాశాలు ఉన్నాయి. టీ20 ఫార్మాట్‌లో ఎక్కువ ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా, కెప్టెన్‌గా వేగంగా 1000 ప‌రుగులు పూర్తి చేసిన ఆట‌గాడిగా, అత్య‌ధిక మ్యాచ్‌లు ఆడిన ఆట‌గాడిగా హిట్‌మ్యాన్ నిల‌వ‌బోతున్నాడు. దీంతో నేడు జ‌ర‌గ‌నున్న తొలి టీ20 మ్యాచ్‌పై అంత‌టా ఆస‌క్తి నెల‌కొంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లోనే హిట్ మ్యాన్ ఆ మైల్‌స్టోన్స్‌ను చేరుకోవాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

అత్య‌ధిక ప‌రుగులు

అత్య‌ధిక ప‌రుగులు

అంత‌ర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో అత్య‌ధిక ప‌రుగుల చేసిన ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించడానికి కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మ‌రో 37 ప‌రుగుల దూరంలో ఉన్నాయి. కెరీర్లో ఇప్ప‌టివ‌ర‌కు 3263 ప‌రుగులు చేసిన హిట్‌మ్యాన్‌.. మ‌రో 37 ప‌రుగులు చేస్తే ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఎక్కువ ప‌రుగులు చేసిన న్యూజిలాండ్ ఓపెన‌ర్ మార్టిన్ గుప్తిల్ (3299) రికార్డును బ‌ద్ద‌లు కొడ‌తాడు. ప్ర‌స్తుతం ఈ జాబితాలో రోహిత్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇక 3296 ప‌రుగుల‌తో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. కాగా రోహిత్ ఈ రికార్డును వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో అందుకుంటాడ‌ని అభిమానులు ఆశించిన‌ప్ప‌టికీ అది జ‌ర‌గ‌లేదు.

అత్య‌ధిక మ్యాచ్‌లు

అత్య‌ధిక మ్యాచ్‌లు

నేటి నుంచి శ్రీల‌కంతో ప్రారంభం కానున్న 3 టీ20ల సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు రోహిత్ శ‌ర్మ‌ ఆడితే ఆ ఫార్మాట్‌లో అత్య‌ధిక మ్యాచ్‌లు ఆడిన బ్యాట‌ర్‌గా నిలుస్తాడు. ప్ర‌స్తుతం ఈ ఫార్మాట్‌లో 122 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శ‌ర్మ రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శ‌ర్మ కంటే ముందు ఉన్న పాకిస్థాన్ ఆట‌గాడు షోయ‌బ్ మాలిక్ 124 మ్యాచ్‌ల‌తో ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉన్నాడు.

వేగంగా 1000 ప‌రుగులు

వేగంగా 1000 ప‌రుగులు

ఇక టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా వేగంగా 1000 ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా నిల‌వాలంటే నేడు శ్రీ‌లంక‌తో జ‌ర‌గ‌బోయే టీ20 మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ 63 ప‌రుగులు సాధించాల్సి ఉంది. ఈ జాబితాలో పాకిస్థాన్ కెప్టెన్ బాబ‌ర్ అజామ్ ముందు ఉన్నాడు. దీంతో నేటి మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ‌ 63 ర‌న్స్ చేసి బాబ‌ర్ అజామ్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా టీ20ల్లో కెప్టెన్‌గా ఇప్ప‌టివ‌ర‌కు 25 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శ‌ర్మ 40.73 సగటుతో 937 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 150 కంటే ఎక్కువ‌గా ఉంది.

నేటి నుంచి టీ20 సిరీస్‌

కాగా భార‌త్, శ్రీ‌లంక మ‌ధ్య‌ నేటి నుంచి ల‌క్నో వేదిక‌గా 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జ‌ర‌గ‌నుంది. నేడు తొలి టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుండ‌గా.. 26, 27వ తేదీల్లో రెండు, మూడో టీ20 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సిరీస్‌లో టీమిండియా హాట్ ఫెవ‌రేట్‌గా బ‌రిలోకి దిగుతుంది.

Story first published: Thursday, February 24, 2022, 14:34 [IST]
Other articles published on Feb 24, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+