
టీ బ్రేక్
మూడో రోజు ఆటలో టీ బ్రేక్ సమయానికి శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. క్రీజులో 27 పరుగులతో మాథ్యుస్, 20 పరుగులతో చరిత అసలంక ఉన్నారు. టీ సెషన్‌కు ముందు రవీంద్ర జడేజా వేసిన చివరి ఓవర్‌లో 2 సిక్సులు, ఆ ఫోర్లతో అసలంక 20 పరుగులు రాబట్టడం విశేషం. ఇక మిగతా బ్యాటర్లలో డి శిల్వ 30, కెప్టెన్ కరుణరత్నే 27, నిసాంక 6, తిరుమాణే డకౌట్ అయ్యారు. భారత బౌలర్లలో అశ్విన్ 2, షమీ, జడేజా తలో వికెట్ తీశారు. కాగా శ్రీలంక ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే 280 పరుగులు చేయాల్సి ఉంది. మొత్తంగా 31 ఓవర్లపాటు సాగిన రెండో సెషన్‌లో 110 పరుగులు రావడంతోపాటు 3 వికెట్లు పడ్డాయి.
తొలి ఇన్నింగ్స్‌లో చేతులెత్తేసిన శ్రీలంక బ్యాటర్లు
ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బాల్‌తోనూ విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 174 పరుగులకే ఆలౌటైంది. బ్యాటింగ్‌లో 175 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో చెలరేగిన రవీంద్ర జడేజా, బౌలింగ్‌లోనూ 5 వికెట్లతో సత్త చాటాడు. 108/4 ఓవర్ నైట్‌స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన శ్రీలంక 65 ఓవర్లలో 174 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో పాతుమ్ నిస్సంక(133 బంతుల్లో 11 ఫోర్లతో 61 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. చివరి నలుగురు బ్యాట్స్‌మన్ అయితే డకౌటవ్వడం విశేషం. జడేజా ఐదు వికెట్ల ప్రదర్శనకు తోడు రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు తీశారు. షమీకి ఓ వికెట్ దక్కింది.
టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్
ఇక ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీమిండియా 574/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. దీంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. భారత బ్యాటర్లలో రవీంద్ర జడేజా 175*, రిషబ్ పంత్ 96, రవిచంద్రన్ అశ్విన్ 61, హనుమ విహారీ 58 పరుగులతో రాణించారు. మిగతావారిలో విరాట్ కోహ్లీ 45, మయాంక్ అగర్వాల్ 33, రోహిత్ శర్మ 29, శ్రేయస్ అయ్యర్ 27, షమీ 20* పరుగులు చేశారు.


Click it and Unblock the Notifications












