India vs Sri Lanka హెడ్ టూ హెడ్ టీ20 రికార్స్‌ల్లో మనోళ్లే తోపు.. ఎవరెవరంటే..

ఈ నెల 24 నుంచి భారత్, శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కాబోతుంది. ఇరు జట్లు 3 మ్యాచ్‌లలో తలపడనున్నాయి. ఈ నెల 24న తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా.. 26, 27వ తేదీల్లో రెండు, మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ క్రమంలో టీ20 ఫార్మాట్‌లో ఇరు జట్లలో ఇప్పటివరకు ఏ జట్టు ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిచందనేది ఆసక్తికరంగా మారింది. ఈ రికార్డును ఒక సారి పరిశీలిస్తే భారత్‌దే పై చేయిగా ఉంది. టీ20 ఫార్మాట్‌లో ఇప్పటివరకు భారత్, శ్రీలంక 22 మ్యాచ్‌లలో తలపడ్డాయి. ఇందులో టీమిండియా 14 మ్యాచ్‌లలో విజయం సాధించగా.. శ్రీలంక 7 మ్యాచ్‌ల్లోనే నెగ్గింది. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇండియాలో జరిగిన మ్యాచ్‌ల్లో భారత్ 8 గెలిచింది. అలాగే శ్రీలంకలో జరిగిన మ్యాచ్‌ల్లో 5 గెలిచింది. తటస్థ వేదికలపై ఒకటి గెలిచింది. అదే శ్రీలంక విషయానికొస్తే స్వదేశంలో 3 గెలిచింది. ఇక ఇండియాలో 2 గెలిచింది. తటస్థ వేదికలపై 2 గెలిచింది.
ఇక ఇండియా, శ్రీలంక టీ20ల్లో తలపడిన మ్యాచ్‌ల్లో రికార్డులన్నీ భారత ఆటగాళ్ల పేరు మీదనే ఉన్నాయి. అత్యధిక పరుగులు చేసిన రికార్డు భారత వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరు మీద ఉంది. కోహ్లీ ఇప్పటివరకు శ్రీలంకపై 339 పరుగులు చేశాడు. అలాగే వ్యక్తిగతంగా శ్రీలంకపై అత్యధిక పరుగులు చేసిన రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరు మీద ఉంది. రోహిత్ సాధించిన అత్యధిక స్కోర్ 118 పరుగులు. అలాగే ఇరు జట్లు తలపడిన ఈ ఫార్మాట్‌లో ఇప్పటివరకు ఒకే ఒక్క సెంచరీ నమోదైంది. అది కూడా రోహిత్ శర్మనే సాధించాడు. అలాగే ఇండియా, శ్రీలంక తలపడిన ఒక టీ20 సిరీస్‌లో ఎక్కువ పరుగులు చేసిన రికార్డు కూడా హిట్ మ్యాన్ పేరు మీదనే ఉంది. హిట్‌మ్యాన్ ఓ సిరీస్‌లో 162 పరుగులు చేశాడు. అలాగే అత్యధిక వికెట్లు తీసిన రికార్డు కూడా భారత బౌలర్ పేరు మీదనే ఉంది. చాహల్ అత్యధికంగా 14 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications