
సూర్యకుమార్ యాదవ్‌కు గాయం
ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ వెస్టిండీస్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు, అవసరమైనప్పుడు రాణించి టీమిండియాను గెలిపించాడు. ఈ క్రమంలో టీ20 సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా కూడా ఎంపికయ్యాడు.
అయితే విండీస్‌తో మూడో టీ20 మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ సూర్యకుమార్ యాదవ్ గాయపడినట్లు తెలుస్తోంది. అతని కుడి చేతి వేళ్లకు గాయమైంది. మంగళవారం లక్నో వేదికగా జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో కూడా సూర్యకుమార్ యాదవ్ పాల్గొన్నాడు. కానీ గాయం తీవ్రం కావడంతో 31 ఏళ్ల సూర్య టీ20 సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.

దీపక్ చాహర్ కూడా దూరం
ఇపటికే ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ కూడా లంకేయులతో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. వెస్టిండీస్‌తో మూడో టీ20 మ్యాచ్‌లో కాలి కండరాలు పట్టేయడంతో తన బౌలింగ్ కోటాను పూర్తి చేయకుండానే మైదానాన్ని వీడిన దీపక్ లంకతో సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. అయితే ఇప్పటికే జట్టులో ఐదుగురు పేసర్లు ఉండడంతో అతని స్థానంలో సెలెక్టర్లు మరొకరిని ఎంపిక చేయలేదు. జట్టులో ప్రస్తుతం జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్ పేసర్లుగా ఉన్నారు.

సిరీస్ షెడ్యూల్
కాగా భారత్, శ్రీలంక మధ్య ఈ నెల 24, 26, 27వ తేదీల్లో టీ20 సిరీస్ జరగనుంది. తొలి టీ20 మ్యాచ్‌కు లక్నో వేదికగా నిలవనుండగా.. రెండు, మూడు టీ20 మ్యాచ్‌లకు ధర్మశాల అతిథ్యం ఇవ్వనుంది. టీ20 సిరీస్ అనంతరం ఇరు జట్లు రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తలపడనున్నాయి. బెంగళూరు వేదికగా మార్చి 4 నుంచి 8 వరకు తొలి టెస్టు మ్యాచ్, మార్చి 12 నుంచి 16 వరకు రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది.

భారత టీ20 జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్(కీపర్), వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ఆవేశ్ ఖాన్.

భారత టెస్ట్ జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), ప్రియాంక్ పాంచల్, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హనుమ విహరి, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్(కీపర్), కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, సౌరభ్ కుమార్, మహమ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్).


Click it and Unblock the Notifications












