Ind vs SL: 35 బంతుల్లోనే 4 వికెట్లు ఫట్.. వణికించిన బుమ్రా.. టీమిండియాకు భారీ ఆధిక్యం

బెంగళూరు: 86-6 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన శ్రీలంక బ్యాటర్లు భారత బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, రవి చంద్రన్ అశ్విన్ ధాటికి కనీసం అర్ధ గంట సేపు కూడా బ్యాటింగ్ చేయలేకపోయారు. రెండో రోజు ఆటలో మరో 5.5 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి మిగతా 4 వికెట్లు కోల్పోయారు. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 109 పరుగులకే కుప్పకూలింది. అంటే రెండో రోజు ఆటలో లంక 35 బంతులు మాత్రమే ఆడింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 143 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో సత్తా చాటాడు.
చెలరేగిన బుమ్రా, అశ్విన్
రెండో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఒక్క పరుగు చేసిన ఎంబుల్దేనియి వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఔటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లోనే 5 పరుగులు చేసిన లక్మల్‌ను అశ్విన్ అద్భుత బాల్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లో 21 పరుగులు చేసిన డిక్వెల్లా.. బుమ్రా బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మళ్లీ తర్వాతి ఓవర్లోనే 8 పరుగులు చేసిన విశ్వ ఫెర్నాండో అశ్విన్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. దీంతో శ్రీలంక 109 పరుగులకే కుప్పకూలింది.
4 ఓవర్లలో 4 వికెట్లు
కాగా రెండో రోజు ఆటలో వరుసగా 4 ఓవర్లలో శ్రీలంక 4 వికెట్లు కోల్పోవడం గమనార్హం. రెండు రోజు శ్రీలంక 5.5 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి మిగతా 4 వికెట్లు కోల్పోయింది. లంక బ్యాటర్లలో మాథ్యూస్ 43, డిక్వెల్లా 21, ధనుంజయ డిసిల్వా 10 మాత్రమే రెండెంకెల స్కోర్ చేశారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు, అశ్విన్, షమీ రెండేసి వికెట్లు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు.

ఇండియా 252కు ఆలౌట్
ఇక మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ 92 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. 98 బంతుల్లోనే 92 పరుగులు చేసిన అయ్యర్ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. ఇతరులెవరూ సహకరించకపోయినప్పటికీ శ్రేయస్ ఒంటరి పోరాటం చేసి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. మిగతా బ్యాటర్లలో రిషబ్ పంత్ 39 (7 పోర్లు) , హనమ విహారీ 31 (4 ఫోర్లు), కోహ్లీ 23 (2 ఫోర్లు), రోహిత్ శర్మ 15 (ఒక ఫోర్, ఒక సిక్సు), అశ్విన్ 13 (ఒక ఫోర్), అక్షర్ పటేల్ 9, షమీ 5, మయాంక్ అగర్వాల్ 4, రవీంద్ర జడేజా 4 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో ఎంబుల్దేనియా, జయవిక్రమ మూడేసి వికెట్లు, డిసిల్వా 2, లక్మల్ ఒక వికెట్ తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications