Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Sri Lanka: శ్రీ‌లంక‌కు బిగ్ షాక్‌.. టీ20 సిరీస్ నుంచి స్టార్ బౌల‌ర్ హసరంగ ఔట్‌

India vs Sri Lanka: Sri Lankan bowler Wanindu Hasaranga misses out on T20 series

భార‌త ప‌ర్య‌ట‌న ఆరంభానికి ముందే శ్రీ‌లంక‌కు భారీ షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ ఆల్‌రౌండ‌ర్ వనిందు హసరంగ టీమిండియాతో జ‌ర‌గ‌నున్న‌ టీ20 సిరీస్‌కు దూర‌మ‌య్యాడు. ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో క‌రోనా బారిన ప‌డిన హ‌స‌రంగ ఇంకా కోలుకోలేదు. తాజాగా నిర్వ‌హించిన ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష‌ల్లో హ‌స‌రంగ‌కు మ‌రోసారి పాజిటివ్‌గా నిర్దార‌ణ అయింది. దీంతో అత‌ను భార‌త్‌తో టీ20 సిరీస్‌కు దూరంగా ఉండ‌నున్నాడు. టీ20 సిరీస్ అనంత‌రం జ‌ర‌గ‌నున్న టెస్టు సిరీస్‌లోనూ హ‌స‌రంగ ఆడ‌డం అనుమానంగానే క‌నిపిస్తుంది. కాగా ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో మూడో టీ20 మ్యాచ్‌కు ముందు శ్రీ‌లంక ఆట‌గాళ్లు కుశాల్‌ మెండిస్‌, బినుర ఫెర్నాండో, వనిందు హసరంగ క‌రోనా బారిన‌ప‌డ్డారు. దీంతో వారు ముగ్గురు సిరీస్‌లోని మిగ‌తా మూడు టీ20 మ్యాచ్‌ల‌కు దూర‌మ‌య్యారు. అంత‌కుముందు ఆడిన తొలి రెండు టీ20 మ్యాచ్‌ల్లో హ‌స‌రంగ 3/38, 2/33 గణాంకాలను న‌మోదు చేశాడు. కాగా ఆస్ట్రేలియాతో జ‌రిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో లంకేయులు 1-4 తేడాతో ఓట‌మి పాల‌య్యారు.

ఇటీవ‌ల ముగిసిన ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) మెగా వేలంలో హ‌స‌రంగను రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు భారీ ధ‌ర వెచ్చించి కొనుగోలు చేసింది. 24 ఏళ్ల‌ హ‌స‌రంగ‌ను ఆర్సీబీ ఏకంగా 10 కోట్ల 75 ల‌క్ష‌ల రూపాయ‌ల భారీ ధ‌ర‌కు ద‌క్కించుకుంది. దీంతో ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక ధ‌ర ప‌లికిన శ్రీ‌లంక ఆట‌గాడిగా హ‌స‌రంగ నిలిచాడు. త‌న అంత‌ర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 35 మ్యాచ్‌లు ఆడిన హ‌స‌రంగ 57 వికెట్లు తీశాడు. అత్యుత్త‌మ గ‌ణాంకాలు 4/9 గా ఉన్నాయి. కాగా భార‌త్, శ్రీ‌లంక మ‌ధ్య ఈ నెల 24, 26, 27వ తేదీల్లో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జ‌ర‌గ‌నుంది. అనంత‌రం ఇరు జ‌ట్లు రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో కూడా త‌ల‌ప‌డ‌నున్నాయి.

శ్రీ‌లంక టీ20 జ‌ట్టు
దాసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్, చరిత్ అసలంక (వైస్-కెప్టెన్), దినేష్ చండిమాల్, దనుష్క గుణతిలక, కమిల్ మిషారా, జనిత్ లియానగే, వానిందు హసరంగా, చామికా కరుణరత్నే, దుష్మంత చమీర, లహిరు కుమార, బినూర ఫెర్నాండో, షిరాన్ ఫెర్నాండో, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, ప్రవీణ్ జయవిక్రమ, ఆషియాన్ డేనియల్.

Story first published: Wednesday, February 23, 2022, 15:15 [IST]
Other articles published on Feb 23, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+