IND vs SL Toss: బ్యాటింగ్ మనదే.. దీపక్ హుడా అరంగేట్రం, జడేజా రీఎంట్రీ.. భారత్ తుది జట్టు ఇదే

లక్నో: భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్ దసున్ షనక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. వెస్టిండీస్‌తో జరిగిన లాస్ట్ మ్యాచ్ టీంతో పోల్చితే టీమిండియా ఈ మ్యాచ్‌లో ఏకంగా 6 మార్పులతో బరిలోకి దిగుతుంది. దీపక్ హుడా ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లోకి అడుగుపెడుతున్నాడు. గాయం కారణంగా గా కొంతకాలంగా టీంకు దూరంగా ఉన్న రవీంద్ర జడేజా ఈ మ్యాచ్ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. ఇక వెస్టిండీస్ పర్యటనకు దూరంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రా కూడా జట్టులోకి వచ్చాడు. కాగా గాయం కారణంగా ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ ఆడడం లేదు.

రోహిత్ ఏమన్నాడంటే..
‘‘టాస్ గెలిస్తే మేము కూడా ఛేజ్ చేయాలని అనుకున్నాం. కానీ మేము ఇప్పడు మొదట బ్యాటింగ్ చేయాలి. మేము ఇక్కడ చివరిసారి సుమారు 4 సంవత్సరాల క్రితం ఆడాం. అప్పుడు పిచ్ బాగుంది. అయితే జట్టు లక్ష్యాలకు సంబంధించినంత వరకు ఏమీ మారదు. జట్టుగా సరైన పనులు చేయాలి. ఈ మ్యాచ్‌లో మాకు కొంత సవాల్ ఉంది. మేము గత చివరి గేమ్ ఆడిన టీంలో 6 మార్పులతో బరిలోకి దిగుతున్నాం. రుతురాజ్ ఆడాల్సి ఉంది. కానీ అతను చేతి మణికట్టుకు గాయం అయింది. అందుకే ఈ రోజు ఆడడం లేదు.'' అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.

ధసున్ షనక ఏమన్నాడంటే..
‘‘మేము మొదట బౌలింగ్ చేస్తాము. ఇది చాలా మంచి పిచ్. మేము గత కొన్ని మ్యాచ్‌లలో బాగా బౌలింగ్ చేశాం. కాబట్టి మా బౌలింగ్ బలానికి మద్దతు ఇస్తున్నాము. మా జట్టులో కొందరికి గాయాలు అయ్యాయి. గాయపడిన మహేష్ తీక్షణ, కుశాల్ మెండిస్ స్థానంలో చండిమాల్, వాండర్సే ఆడుతున్నారు. అని శ్రీలంక కెప్టెన్ ధసున్ షనక తెలిపాడు.
తుది జట్లు
భారత్:
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, దీపక్ హుడా, రవీంద్ర జడేజా, వెంకటేష్ అయ్యర్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్.
శ్రీలంక:
పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, చరిత్ అసలంక, దినేష్ చండిమాల్(వికెట్ కీపర్), జనిత్ లియానాగే, దసున్ షనక(కెప్టెన్), చమిక కరుణరత్నే, జెఫ్రీ వాండర్సే, ప్రవీణ్ జయవిక్రమ, దుష్మంత చమీర, లహిరు కుమార.

గత రికార్డులు
టీ20 ఫార్మాట్‌లో ఇప్పటివరకు భారత్, శ్రీలంక 22 మ్యాచ్‌లలో తలపడ్డాయి. ఇందులో టీమిండియా 14 మ్యాచ్‌లలో విజయం సాధించగా.. శ్రీలంక 7 మ్యాచ్‌ల్లోనే నెగ్గింది. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇండియాలో జరిగిన మ్యాచ్‌ల్లో భారత్ 8 గెలిచింది. అలాగే శ్రీలంకలో జరిగిన మ్యాచ్‌ల్లో 5 గెలిచింది. తటస్థ వేదికలపై ఒకటి గెలిచింది. అదే శ్రీలంక విషయానికొస్తే స్వదేశంలో 3 గెలిచింది. ఇక ఇండియాలో 2 గెలిచింది. తటస్థ వేదికలపై 2 గెలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications