IND vs SL 3rd T20I: టాస్ గెలిచిన శ్రీలంక.. ఓపెనర్‌గా శాంసన్.. 4 మార్పులతో బరిలోకి టీమిండియా

ధర్మశాల: భారత్‌తో మూడో టీ20 మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొదట బౌలింగ్ చేయనుంది. ఇప్పటికే సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తుండగా.. చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని శ్రీలంక భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 4 మార్పులతో బరిలోకి దిగుతుండగా.. శ్రీలంక రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మకు జతగా వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు.

దసున్ శనక ఏమన్నాడంటే..
''మేము మొదట బ్యాటింగ్ చేస్తాము. చాలా మంచి వికెట్, పరిస్థితులు నిజంగా బాగున్నాయి. ఈ మ్యాచ్‌లో మేము రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నాం. మేము గౌరవం కోసం సిరీస్‌లో మిగిలిన ఈ ఒక మ్యాచ్‌నైనా గెలవాలనుకుంటున్నాము. మా ఆటగాళ్లకు ఇది మంచి అవకాశం.'' అని శ్రీలంక కెప్టెన్ దసున్ శనక తెలిపాడు

రోహిత్ శర్మ ఏమన్నాడంటే..
''టాస్ గెలిస్తే మేము కూడా ముందుగా బౌలింగ్ చేయాలని కోరుకున్నాము. జట్టుగా మెరుగయ్యేలా సవాలు చేస్తూనే ఉండాలనుకుంటున్నాము. ప్రతి అవకాశం గణించబడుతుంది. గత రాత్రి అయిన గాయం కారణంగా ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్ ఆడడం లేదు. అలాగే జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, యజుర్వేంద్ర చాహల్‌లకు విశ్రాంతి ఇచ్చాం. వారి స్థానంలో రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్, మహ్మద్ సిరాజ్‌ను జట్టులోకి తీసుకున్నాం. ఇక టీ20 ఫార్మాట్‌లో 125 మ్యాచ్‌ల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఇంకా చాలా సంవత్సరాలు ఆడాలి అనుకుంటున్నాను.'' అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.

తుది జట్లు
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, దనుష్క గుణతిలక, చరిత్ అసలంక, దినేష్ చండిమల్(వికెట్ కీపర్), జనిత్ లియానాగే, దసున్ షనక (కెప్టెన్), చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, జెఫ్రీ వాండర్సే, బినుర ఫెర్నాండో, లహిరు కుమార
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications