హైదరాబాద్: భారత్‌తో జరిగే ఏకైక టీ20 మ్యాచ్ కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు సోమవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. టెస్టుల్లో, వన్డేల్లో భారత చేతిలో వైట్ వాష్‌కు గురైన శ్రీలంక జట్టు టీ20కి ఏకంగా ఆరు మార్పులతో బరిలోకి దిగుతోంది.
ఉపుల్ తరంగ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టులో శ్రీలంక క్రికెట్ బోర్డు ఆరు మార్పులు చేసింది. వన్డేల్లో ఆడిన జట్టులో ఆరుగురు టీ20కి దూరమయ్యారు. మరోవైపు చమీర, విశ్వ ఫెర్నాండో, సండకన్, ప్రసన్నలపై వేటు పడగా కుశాల్ మెండిస్‌కు విశ్రాంతినిచ్చారు.

గాయం కారణంగా కపుగెదర దూరమయ్యాడు. వాండర్సే, శనక, ఉదాన, లక్మల్, సంజయ, మునవీర జట్టులోకి వచ్చారు. ఇప్పటికే టెస్టు సిరిస్‌ను 3-0తో, వన్డే సిరిస్‌ను 5-0తో చేజార్చుకున్న శ్రీలంక కనీసం టీ20లోనైనా గెలవాలనే పట్టుదలతో ఈ మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది.
ఇరు జట్ల మధ్య సెప్టెంబర్ 6 (బుధవారం) జరగనున్న ఈ ఏకైక టీ20కి కొలంబోలోని ప్రేమదాస స్టేడియం ఆతిథ్యమిస్తోంది.