For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గాలె టెస్టులో టీమిండియా ఘన విజయం: 304 పరుగుల తేడాతో గెలుపు

తొలి టెస్టులో శ్రీలంక జట్టును టీమిండియా కట్టడి చేస్తూ భారీ విజయం సాధించే దిశగా అడుగులు వేస్తోంది.

గాలెశ్రీలంకతో జరిగిన తొలిటెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక బ్యాట్స్‌మన్‌ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయారు. 8 వికెట్లు కోల్పోయిన శ్రీలంక నాలుగో రోజు 245 పరుగులు చేసింది.

కాగా, గాయాల కారణంగా హెరాత్, గుణరత్నెలు బ్యాటింగ్ దిగలేదు. దీంతో 304 పరుగుల భారీ ఆధిక్యంతో భారత్ విజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. 2008 తర్వాత గాలెలో భారత్ తొలి ఇదే.

చేతులెత్తేసిన టాప్ ఆర్డర్

సెకండ్‌ ఇన్నింగ్స్‌లో 47 ఓవర్లు ఆడిన శ్రీలంక 4 వికెట్లు నష్టపోయి 157 పరుగులు చేసింది. కరుణరత్నె మినహా టాప్‌ఆర్డర్‌ చేతులెత్తేయడంతో లంక తక్కువ స్కోరుకే పరిమితమైంది.

India vs Sri Lanka Score, 1st Test, Day 4: Hosts lose two wickets in quick succession

భారత్‌ బ్యాట్స్‌మెన్‌ రాణించిన పిచ్‌పై ఆతిథ్య ఆటగాళ్లు నిలవలేకపోతున్నారు. మరోవైపు అటు బ్యాట్‌తో రాణించిన టీమిండియా బంతితోనూ అద్భుతంగా ఆకట్టుకుంటుంది. విజయానికి భారత్‌ ఇంకా 6 వికెట్ల దూరంలో ఉంది. అదే శ్రీలంక గెలుపు కోసం ఇంకా 393 పరుగులు అవసరం ఉంది. ప్రస్తుతం కరుణరత్నె(72), డిక్వెలా(26) క్రీజులో ఉన్నారు.

లంచ్ విరామానికి 85/2

భారత్‌ నిర్దేశించిన 550 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంక ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు చేజార్చుకుంది. పటిష్ఠ భారత్‌ బౌలింగ్‌ ముందు బ్యాట్స్‌మెన్‌ స్వేచ్ఛగా ఆడలేకపోతున్నారు.

పేసర్లు ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ పదునైన బౌలింగ్‌తో కట్టడి చేస్తున్నారు. జట్టు స్కోరు 22 వద్ద తరంగను షమీ ఎల్బీగా పెవిలియన్‌ పంపగా.. ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో పుజారా చేతికి గుణతిలక చిక్కాడు. లంచ్ విరామానికి రెండు వికెట్లు కోల్పోయిన శ్రీలంక 85 పరుగులు చేసింది.

సెంచరీ బాదేసిన కోహ్లీ: లంకకు 550 పరుగుల భారీ లక్ష్యం

ఆతిథ్య శ్రీలంక జట్టు ముందు టీమిండియా 550 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ అసాధారణ ప్రతిభ కనబరిస్తే తప్ప భారత్‌ విజయాన్ని అడ్డుకునే అవకాశం లేదు. తొలి ఇన్నింగ్స్‌ తరహాలోనే రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత్‌ బ్యాట్స్‌మెన్‌ ఉతికారేశారు.

విరాట్‌ కోహ్లి(103 నాటౌట్‌: 136 బంతుల్లో 5×4, 1×6) అద్భుత శతకంతో రాణించడంతో సెకండ్‌ ఇన్నింగ్స్‌లో భారత్‌ 240/3 పరుగులకు డిక్లేర్డ్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 309 పరుగుల ఆధిక్యం కలుపుకొని లంక ముందు 550 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఓవర్‌నైట్‌ స్కోరు 189/3తో శనివారం నాలుగో రోజు ఆటలో 6.3 ఓవర్లలోనే టీమిండియా బ్యాట్స్‌మెన్‌ 51 పరుగులు రాబట్టారు. మరో ఎండ్‌లో రహానె(23 నాటౌట్‌) ఆకట్టుకున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+