India vs Sri Lanka:తొలి వన్డేలో శాంసన్‌కి దక్కని చోటు..కీపర్‌గా ఇషాన్ కిషన్! సంజు వేటుకి అసలు కారణం ఇదే!

కొలంబో: ప్రేమదాస మైదానంలో శ్రీలంక, భారత్ జట్ల మధ్య తొలి వన్డే జరుగుతున్న విషయం తెలిసిందే. భారత్‌లో ఇద్దరు కుర్రాళ్లు అరంగేట్రం చేశారు. యువ కెరటం ఇషాన్ కిషన్, 360 డిగ్రీ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తొలి అంతర్జాతీయ వన్డే ఆడుతున్నారు. చాన్నాళ్ల తర్వాత కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్ కలిసి ఆడుతున్నారు. శిఖర్ ధావన్‌తో పాటు యువ ఆటగాడు పృథ్వీ షా ఓపెనింగ్ చేయనున్నాడు. ఇక భారత జట్టులోకి మొదటిసారి ఎంపికైన నితీష్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్‌లకు నిరాశే ఎదురైంది. వీరితో పాటు సీనియర్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్‌కి అవకాశం దక్కలేదు. సంజుకు తుది జట్టులో చోటు ఇవ్వకపోడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

కీపర్‌గా ఇషాన్ కిషన్:
శ్రీలంక టూర్‌కి దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్ రూపంలో ఇద్దరు కొత్త ఓపెనర్లతో పాటు ఫాస్ట్ బౌలర్ చేతన్ సకారియాని భారత సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఐపీఎల్ 2021 సీజన్‌లో సత్తాచాటిన ఈ ముగ్గురికీ అరంగేట్రం ఛాన్స్ దక్కుతుందని అంతా ఊహించారు. కానీ ముగ్గురికీ నిరాశే ఎదురైంది. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లు ఈ మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వికెట్ కీపర్ స్థానంలో కిషన్ ఎంపికయ్యాడు. సంజు శాంసన్‌ని ఈ సిరీస్ మొత్తం కీపర్‌గా ఆడించాలని మాజీ క్రికెటర్లు గత కొద్దిరోజుల నుంచి సూచిస్తుండగా.. తొలి వన్డేలోనే అతను రిజర్వ్ బెంచ్‌కి పరిమితమయ్యాడు. దాంతో నెటిజన్లు మండిపడుతున్నారు.

మోకాలి గాయం కారణమా:
అయితే సంజు శాంసన్‌ని తుది జట్టులోకి తీసుకోకపోవడానికి అసలు కారణం వెలుగులోకి వచ్చింది. ప్రాక్టీస్ సెషన్‌లో అతడు గాయపడినట్లు సమాచారం తెలుస్తోంది. శాంసన్‌కి మోకాలికి గాయం కావడంతో.. ఇషాన్ కిషన్‌కి కీపర్‌గా ఛాన్స్ దక్కినట్లు తెలుస్తోంది. సంజు గాయాన్ని బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తోందట. గాయం చిన్నదే అని సమాచారం. మరోవైపు మనీశ్ పాండేకి తుది జట్టులో చోటు దక్కడంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్ 2021లో అతడు నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే.

చెలరేగిన భారత స్పిన్నర్లు:
శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత స్పిన్నర్లు చెలరేగుతున్నారు. ఓపెనర్లు రాణించడంతో ఒక దశలో వికెట్ నష్టానికి 85 పరుగులతో ఉన్న శ్రీలంక.. స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 2.. యుజ్వేంద్ర చహల్, కృనాల్ పాండ్యా చెరొక వికెట్ తీసుకున్నారు. పేస్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, హార్దిక్ పాండ్యాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. లంక ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో 32, మినోద్ భనుక 27.. భనుక రాజపక్స 24, ధనుంజయ డిసిల్వా 14 పరుగులు చేసి ఔటయ్యారు.

భారత్ తుది జట్టు:
శిఖర్ ధావన్ (కెప్టెన్), పృథ్వీ షా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, దీపక్ చహర్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యుజ్వేందర్ చహల్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications