
హైదరాబాద్: శ్రీలంక మాజీ ఆల్ రౌండర్ రస్సెల్ ఆర్నాల్డ్‌కు భారత్‌లో ట్రాఫిక్ జామ్ అంటే ఏమిటో అర్థమైంది. భారత్-శ్రీలంక జట్ల మధ్య ప్రస్తుతం జరుగుతున్న మూడు టీ20ల సిరిస్‌లో చివరిదైన మూడో టీ20కి పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసిఎ) స్టేడియం ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మూడో టీ20 మ్యాచ్ కోసం కామెంటేటర్ల ప్యానెల్లో ఉన్న ఆర్నాల్డ్ ఇక్కడకు వచ్చా డు. విమానాశ్రయం నుండి తన హోటల్ వైపు వెళుతున్నప్పుడు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నాడు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న వీడియోని తన ట్విట్టర్‌లో పోస్టు చేసి 'వెళ్లే అవకాశమే లేదు' అనే క్యాప్షన్ పెట్టాడు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియోలో తెగ వైరల్ అవుతోంది. అయితే, ఇక్కడ ఇదంతా మామూలే అని నెటిజన్లు ట్వీట్లు చేశారు. శ్రీలంక తరుపున 44 టెస్టులాడిన ఆర్నాల్డ్ 1821 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలతో పాటు 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 11 వికెట్లు సైతం పడగొట్టాడు.
46 ఏళ్ల ఆర్నాల్డ్ శ్రీలంక తరుపున 180 వన్డేలాడి 3,950 పరుగులు చేయడంతో పాటు 40 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే, ఇండోర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మూడు టీ20ల సిరిస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.
గువహటి వేదికగా జరిగిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. దీంతో చివరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది. సిరీస్‌ను సమం చేయాలంటే ఇందులో తప్పక గెలవాలి. దీంతో మూడో టీ20లో గెలిచి సిరిస్‌ను సమం చేయాలని గట్టి పట్టుదలతో శ్రీలంక ఉంది.
ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టుపై ప్రతీకారం తీర్చుకుని సిరీస్‌ను సమంతో ముగిస్తుందా లేదా చూడాలి మరి. ఈ సిరిస్‌లో ఇప్పటికే ఒక మ్యాచ్‌లో కోహ్లీసేన నెగ్గడంతో ఆఖరి టీ20లో పలు మార్పులు చేసే అవకాశం ఉంది. మ్యాచ్ శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమవుతుంది.
భారత తుది జట్టు (అంచనా) :
విరాట్ కోహ్లీ (కెప్టెన్), లోకేశ్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, యజ్వేంద్ర చాహల్/కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, నవదీప్ సైనీ, జస్‌ప్రీత్ బుమ్రా.